Life Imprisonment for Friend Murder : ఫ్రెండ్ మీద అనుమానం వస్తే అది నిజమైన స్నేహం కాదని కొందరు అంటే, అసలు ఫ్రెండ్ అంటనే నమ్మకం అంటూ మరికొందరు అంటారు. ఇలా ఫ్రెండ్షిప్ను దాంపత్య జీవితంతోనూ పోల్చుతూ స్నేహం అంటే ఇదేరా అంటూ పొగిడిన వాళ్లు సైతం చాలా మంది ఉన్నారు. కానీ 1000 రూపాయల కోసం స్నేహితుడినే హత్య చేసి శవాన్ని మూడు భాగాలుగా నరికి కాల్వలో పడేసిన ఓ మిత్రుడు గురించి మీరూ తెలుసుకోవాల్సిందే. దోస్తులు అంటే ప్రాణం ఇచ్చేవాళ్లే కాదు, ప్రాణం తీసే వాళ్లు కూడా ఉంటారని అనడానికి ఈ ఘటననే నిదర్శనం.
ఇంట్లోని వెయ్యి రూపాయలు తీశాడనే అనుమానంతో స్నేహితుడిని హత్య చేసి శవాన్ని మూడు భాగాలుగా నరికి మురుగు కాల్వలో పడేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.15,000 జరిమానా విధిస్తూ రంగరెడ్డి జిల్లా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా జిల్లెడ్ చౌదరిగూడెం మండలం కాసులాబాద్‌కు చెందిన గంజేటి అంజయ్య(46), తట్టెపల్లి రాజు (35) స్నేహితులు. గంజేటి అంజయ్య భార్య పట్టింటికి వెళ్లడంతో ఇంట్లో అతను ఒక్కడే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు తట్టెపల్లి రాజు అంజయ్య ఇంటికి వెళ్లి అక్కడే నిద్రించేవాడు. ఆగస్టు 12న 2020లో అంజయ్య ఇంట్లో రూ.1,000 మాయం కావడంతో రాజునే తీశాడని అనుమానించాడు. దీంతో కోపం పెంచుకుని ఆగస్టు 15న రాత్రి నిద్రిస్తున్న రాజును చంపాడు. ఆపై మృతదేహాన్ని మూడు భాగాలుగా నరికి ఊరి బయట కాల్వలో పడేశాడు.
ప్రేమకు అడ్డొస్తున్నాడని బీరు సీసాలతో దాడి చేసి స్నేహితుడి హత్య : మరోవైపు ప్రేమ కోసం కూడా కొంత మంది స్నేహితుడిని హత్య చేసేందుకు వెనకాడడం లేదు. హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో తన ప్రియురాలితో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడినే చంపాడో ఓ యువకుడు. కిరాతకంగా బీర్ సీసాలతో దాడి చేసి, గొంతు నులిమి రైల్వే ట్రాక్‌పైన పడేశారు. ప్రమాదంగా చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. నిందితులంతా 20 ఏళ్ల లోపువారే. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రియుడితో కలిసి మూడో భర్తను కొట్టిచంపిన భార్య - ఆపై స్పాట్లో నుంచి మరో ప్రియుడికి ఫోన్ చేసి?