ETV Bharat / state

రాడిసన్ డ్రగ్స్​ కేసులో ఊహించని ట్విస్టులు - రేపు విచారణకు దర్శకుడు క్రిష్ - Radisson Drugs case

Radisson Drugs Party Case Updates : హైదరాబాద్‌లో సంచలనంగా మారిన గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డగ్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అబ్బాస్ అలీని 24 గంటలకు పైగా పోలీసులు విచారించగా, పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిచ్చిన వివరాల ఆధారంగా వివేకానంద్‌ డ్రైవర్‌ ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాస్‌ వివిధ మార్గాల్లో తీసుకొచ్చే కొకైన్‌ను డ్రైవర్‌ ప్రవీణ్‌కు ఇస్తున్నట్లు విచారణలో తేలింది.

Drug smuggling in Telangana
Radisson Drugs Party Case Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 7:27 AM IST

రాడిసన్ కేసులో దర్యాప్తు ముమ్మరం - వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు

Radisson Drugs Party Case Updates : గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌లో(Radisson Hotel) జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్‌కు మత్తు పదార్ధాలు సరఫరా చేసిన సయ్యద్‌ అబ్బాస్‌ అలీ విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిచ్చిన వివరాల ఆధారంగా వివేకానంద్‌ డ్రైవర్‌ ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాస్‌ వివిధ మార్గాల్లో తీసుకొచ్చే కొకైన్‌ను, డ్రైవర్‌ ప్రవీణ్‌కు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. అలా తెచ్చిన డ్రగ్స్‌ను (Drugs) ప్రవీణ్‌ వివేకానంద్‌కు అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ విషయంలో కొన్నిసార్లు ప్రవీణ్‌ అబ్బాస్‌ మధ్య లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్‌ లిషిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ అరెస్ట్ - 8 మందిపై కేసు నమోదు

Drug smuggling in Telangana : డ్రగ్స్‌ కేసులో మరికొందరి ప్రమేయమున్నట్లు భావించి దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులకు ఆధారాలు సేకరించే సమయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. రాడిసన్‌ హోటల్‌లో మొత్తం దాదాపు 200 కెమెరాలుండగా, అందులో కేవలం 20 మాత్రమే పని చేస్తున్నట్లు తెలిసింది. దర్యాప్తుకు అది పెద్ద ఆటంకంగా మారింది. కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్‌ తరచూ నిర్వహించే పార్టీలకు అతని స్నేహితులు సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారు హాజరవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరెవరు వస్తున్నారు? అనే డేటా సేకరించేందుకు ప్రయత్నిస్తుండగా, సీసీ కెమెరాలు పని చేయట్లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతిసారీ పార్టీలు నిర్వహించేందుకు వినియోగించే 1200, 1204 గదుల సమీపంలోని సీసీ కెమెరాలు పని చేయకపోవడం పోలీసులకు దర్యాప్తులో ఆటకంగా మారింది.

ప్రధాన నిందితుడు వివేకానందను కోర్టుకు తరలించగా, సొంత పూచీకత్తుపై బెయిల్ లభించింది. మరో ఇద్దరికి స్టేషన్‌లోనే బెయిల్ లభించింది. డ్రగ్స్‌ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్‌ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయన్ను విచారణకు పిలిచారు. ప్రస్తుతం అందుబాటులో లేనని, శుక్రవారం వస్తానని క్రిష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. క్రిష్ హాజరైన తర్వాత మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Drug Bust in Gachibowli Radisson Hotel : హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌ స్నేహితులతో కలిసి ఈ నెల 24న డ్రగ్స్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. 3 గ్రాముల కొకైన్‌ తెప్పించుకొని హోటళ్లోని 2 గదుల్లో పార్టీ చేసుకున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అర్ధరాత్రి హోటల్‌కు చేరుకోగా, వారంతా అక్కడి నుంచి పారిపోయారు. గదుల్లో కొకైన్ ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు, వివేకానంద్ ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు వివేకానంద అంగీకరించాడు.

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం - ప్రధాన నిందితుడి నుంచి కీలక విషయాలు

డ్రగ్స్ పట్టుబడుతున్నా కొత్త కేసులు ఎలా పుట్టుకొస్తున్నాయి - వీటికి అంతమే లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.