ETV Bharat / state

ఆ పార్టీలో క్రిష్‌ పాల్గొన్నారో లేదో నిర్ధరణ కాలేదు: మాదాపూర్‌ డీసీపీ - Drug Bust in Gachibowli Radisson

Radisson Drug Case Update : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖులు ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ వినిత్ వెల్లడించటంతో మరింత ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే సినీ డైరెక్టర్ క్రిష్, త్వరలోనే విచారణకు హాజరవుతున్నట్లు వెల్లడించారు.

Drug Bust in Gachibowli Radisson Hotel
Radisson Drug Case Update
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 7:55 PM IST

Updated : Feb 27, 2024, 10:32 PM IST

Radisson Drug Case Update : హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్‌ నిర్వహించిన డ్రగ్స్‌ పార్టీ నిర్వహించగా, అదే సమయంలో సినీ దర్శకుడు క్రిష్‌(జాగర్లమూడి రాధాకృష్ణ) అక్కడకు హాజరైనట్లు పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడు వివేకానంద్‌ సైతం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో క్రిష్‌ హాజరైనట్లు చెప్పాడు.

ఆ పార్టీలో క్రిష్‌ పాల్గొన్నారో లేదో నిర్ధరణ కాలేదు: మాదాపూర్‌ డీసీపీ

క్రిష్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే క్రిష్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించి విచారణకు(Police Inquiry) రావాలని తెలిపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని క్రిష్‌ బదులిచ్చారని, వైద్య పరీక్షలు నిర్వహించాక అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. హోటల్‌లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారని, పార్టీల్లో డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి పాల్గొన్నారో లేదో పూర్తిగా నిర్ధరణ కాలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ వినిత్ వెల్లడించారు.

"రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తన్నాం. నిందితుల బ్లడ్‌ శాంపిల్స్‌ పరీక్షిస్తే డ్రగ్స్‌ పాజిటివ్‌గా వచ్చాయి. హోటల్‌లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారు. పార్టీలో క్రిష్‌ పాల్గొన్నారో లేదో పూర్తిగా నిర్ధరణ కాలేదు. వివేకానంద్‌కు క్రిష్‌కు పరిచయం ఎన్నాళ్లుగా ఉందో తెలియదు. నిందితులు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తెస్తున్నారో దర్యాప్తు చేస్తున్నాం."-వినిత్, మాదాపూర్ డీసీపీ

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ అరెస్ట్ - 9 మందిపై కేసు నమోదు

Gachibowli Drugs Case : మాదాపూర్‌ ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహించారనే సమాచారంతో ఆదివారం అర్థరాత్రి తర్వాత సోదాలు చేసి మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్‌నాథ్‌ను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్‌ లిషి, డ్రగ్స్‌ సరఫరాదారు సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జాఫ్రీ పరారయ్యారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సోమవారం అబ్బాస్‌ అలీ జాఫ్రీని అదుపులోకి తీసుకున్నారు.

అబ్బాస్‌ గతంలో మంజీరా గ్రూపు సంస్థలో పనిచేసి ఉద్యోగం మానేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కూడా వివేకానంద్‌తో సంబంధాలు కొనసాగించాడని, ఆ పరిచయంతోనే అబ్బాస్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నట్లు తేలిందని వివరించారు. డ్రగ్స్‌ పార్టీలో(Drugs Party) పాల్గొన్న రఘుచరణ్‌ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణకు హాజరవుతాననీ తెలిపినట్లు పేర్కొన్నారు. పార్టీ జరిగిన రోజు దర్శకుడు క్రిష్ సైతం అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయాన్ని వివేకానంద కూడా పోలీసుల ముందు తెలిపాడు. వీరితో పాటు పరారీలో ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

Drug Bust in Gachibowli Radisson Hotel : పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, బంజారాహిల్స్‌లోని నివాసముండే వివేకానంద్‌ అమెరికాలో మాస్టర్‌ పూర్తి చేసిన అనంతరం 2010లో హైదరాబాద్‌కు వచ్చాడు. తండ్రికి సంబంధించిన వ్యాపారాలు పర్యవేక్షిస్తున్నాడు. విలాసజీవితానికి అలవాటు పడిన వివేకానంద్‌ గతేడాది నుంచి డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. డ్రగ్స్‌ తీసుకోవాలనుకున్న ప్రతిసారీ తన స్నేహితులను రాడిసన్‌ హోటల్‌లోని రెండు గదులకు పిలిపించేవాడు. తనకు డ్రగ్స్‌ అవసరమైన ప్రతిసారీ వివేకానంద్‌ తన సంస్థలో మాజీ ఉద్యోగి అబ్బాస్‌ను సంప్రదించి నేరుగా హోటల్‌కు కొకైన్‌ తెప్పించుకుంటున్నాడు.

మత్తు పదార్థాల కట్టడిపై సర్కార్ ఫోకస్ - రాష్ట్రంలో 'హుక్కా'ను నిషేధిస్తూ నిర్ణయం

ఇప్పటివరకూ అబ్బాస్‌ 10 సార్లు డ్రగ్స్‌ ఇచ్చాడని, ప్రతిసారీ 4 గ్రాముల చొప్పున తెప్పించేవాడని పోలీసుల విచారణతో తేలింది. ఇలా మొత్తం 10 సార్లు డ్రగ్స్‌ పార్టీ నిర్వహించాడు. వివేకానంద్‌ గ్రాము కొకైన్‌ రూ.14 వేల చొప్పున కొని, అబ్బాస్‌కు అదనంగా రూ.2 వేలు ఇచ్చేవాడు. ఈ డ్రగ్స్‌ పార్టీలకు తన స్నేహితులు నిర్భయ్, రఘు చరణ్, కేదార్, సందీప్, నీల్, సహా యువతులు శ్వేత, లిషి హాజరయ్యేవారు. అబ్బాస్‌కు మరికొందరి ద్వారా హైదరాబాద్‌లోనే డ్రగ్స్‌(Hyderabad Drug Mafia) అందుతున్నట్లు తెలిసింది. అబ్బాస్‌కు డ్రగ్స్‌ ఎవరు ఇస్తున్నారు? అతను ఇంకా ఎవరికైనా విక్రయిస్తున్నాడా అనే అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Police Facing challenges in Case : డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్న హోటల్‌ నిర్వాహకులపైనా కేసులు నమోదు చేయాలని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. డ్రగ్స్‌ పార్టీల కోసం వినియోగించిన గదుల్ని సీజ్‌ చేస్తామని చెప్పారు. విచారణ సందర్భంగా పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. పార్టీకి గతంలో ఎవరెవరు వెళ్లారు తదితర ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో హోటల్‌లో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఇబ్బందిగా మారింది.

కమీషన్​ కోసం పనిచేసే స్థాయి నుంచి మత్తుదందాలో కింగ్​ స్థాయికి - స్టాన్లీ స్టోరీ 'పుష్ప'కు ఏమాత్రం తీసిపోదుగా!

ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందాలో సినీ నిర్మాత- రూ.2వేల కోట్ల నెట్​వర్క్ గుట్టురట్టు

Last Updated : Feb 27, 2024, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.