ETV Bharat / state

నలుగురికి నచ్చినది, మాకసలే నచ్చదంటున్న నవ దంపతులు - ప్రీవెడ్డింగ్ పేరుతో వింతలు, విన్యాసాలు ​ - Preweddng Photography Issues

Pre Wedding Shoot in Strange Trends : ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో పెళ్లి ఒకటి. అపురూపమైన ఆ మధుర క్షణాలు చిరకాలం నిలిచిపోయేలా దాచుకోవాలి అనుకుంటారు. ఆ తీపి జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల రూపంలో పది కాలాలపాటు పదిలం చేసుకోవాలనుకుంటారు. నాడు పెళ్లి సమయంలోనే వీడియోలు తీయించుకుని, ఫొటోలను అచ్చు వేయుంచుకునేవారు. నేడు ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే వీడియో షూట్ చేయించుకుంటున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. ఇలాంటి వారి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్ షూట్ స్టూడియోలు వెలిశాయి. భిన్నమైన సెట్టింగులతో సినిమా షూటింగ్​ను తలపించేలా ఏర్పాటు చేస్తున్నారు. లోకో భిన్న రుచి అన్న చందంగా నలుగురికి భిన్నంగా ఉండాలనే తాపత్రయంతో కొందరు ఆసుపత్రుల్లో, శ్మశానంలో, బురదలో సైతం షూట్ చేయించుకుంటున్నారు. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకమవుతున్నాయి.

Destination Prewedding Video Shoot
Pre Wedding Shoot in Strange Trends
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 10:01 AM IST

Pre Wedding Shoot in Strange Trends : నేటి అనుభూతులే రేపటి జ్ఞాపకాలు, వాటిని దాచిపెట్టుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దానిలో భాగంగానే వచ్చినవే ఫొటోలు, వీడియోలు. నేటి వివాహ వ్యవస్థలో విస్తృతంగా కొనసాగుతున్న ట్రెండ్ ప్రీ వెడ్డింగ్. పెళ్లికి ముందు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కలిసి తీయించుకునే ఫొటో, వీడియో షూట్ ప్రక్రియ. గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ భారతీయ వివాహ వ్యవస్థలో(Indian Marriage System) ఓ భాగమైంది.

'సంతోషాల పంట పండిద్దాం'- పొలంలో యువరైతు ప్రీ వెడ్డింగ్ షూట్​

మొదట నగరాల్లో ఉండే ఈ ట్రెండ్ నేడు పట్టణాలు దాటి పల్లెలకూ పాకింది. ఒకప్పుడు పెళ్లి రోజు ఫ్లెక్సీ పెట్టించడానికి రెండు, మూడు రోజుల ముందు వధూవరులు ఫొటో దిగేవారు. అదే ఆధునీకరణ చెందుతూ ప్రీవెడ్డింగ్ షూట్​లా మారింది. ఫొటోలకే పరిమితం కాకుండా సినిమా పాటలకు డాన్స్ చేస్తూ రకరకాల ప్లేసుల్లో వీడియో షూట్ చేయించుకుంటున్నారు. కొందరు మాత్రం వీడియో తీస్తున్న సమయంలో జరిగిన కామెడీ క్లిప్​లను పెళ్లి రోజున(Marriage Day) ప్రొజెక్టర్ ద్వారా అందరికీ చూయిస్తున్నారు. ఇలా ఒకరికి భిన్నంగా మరొకరు వీడియోలను క్రియేట్​ చేసుకుంటున్నారు. వీటికి తగ్గట్లు దుస్తులు, ప్రాంతాలను ఎంపిక చేసుకుని రెండు, మూడు రోజుల్లో షూట్ ముగించుకుంటున్నారు.

Destination Prewedding Video Shoot : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ అపురూప ఘట్టం. ఆ ఆనంద సన్నివేశాలు పదికాలాలు గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. పుట్టింటి నుంచి అమ్మాయి అత్తింటికి వెళ్లే ఆ ఘట్టాన్ని కెమెరాలతో బంధించాలనుకునేవారు. పెళ్లి సమయంలో ఫొటో దిగటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ప్రపంచం మారుతున్న కొద్దీ అలవాట్లు, అభిరుచులు మారుతాయి.

ప్రీవెడ్డింగ్ అనే అనుకరణ కూడా ఆ కోవలోనిదే. నానాటికీ క్రేజ్ పెరగడంతో దీని ద్వారా చాలా మందికి ఉపాధి లభిస్తోంది. వీడియో, ఫొటోలు తీసేవారు మాత్రమే కాదు, లొకేషన్లు, ప్రత్యేక స్టూడియోలు, దుస్తులు, అలంకరణ సామగ్రి(Decoration Equipment), వస్తువులు, వాహనాలు సమకూర్చేవారు ఇలా ఎంతో మంది దీని ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఈ తరహా షూట్​ల కోసం చాలా మందే అవసరం ఉంటారు. వారందరి ఖర్చులు షూట్ చేయుంచుకునేవారు భరించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా కొన్ని వేల మంది దీనిపై ఆధారపడి బతుకుతున్నారు.

Preweddng Photography Issues : నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో అంటోంది నేటి తరం. అందుకనే విద్యఉద్యోగావకాశాల్లోనే కాదు, ప్రీవెడ్డింగ్ షూట్లలో సైతం భిన్నత్వాన్నే కోరుకుంటున్నారు. అయితే కొంత మంది ప్రీవెడ్డింగ్ పేరుతో వింతలు విన్యాసాలు చేస్తున్నారు. ఒకప్పుడు బీచ్​ల వద్ద పచ్చని ప్రకృతి మధ్య చేసేవారు. ఇప్పుడు ప్రత్యేకత కనబరచాలనే తాపత్రయంతో శ్మశాన వాటికలు, ఆసుపత్రులు, మట్టి బురద అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తున్నారు.

అదిగో పంచెకట్టు.. ఇదిగో చీరకట్టు.. పల్లెటూరి స్టైల్​లో ప్రీ-వెడ్డింగ్​ షూట్.. అదుర్స్​ కదా!

ఉత్తరాఖండ్​లో ఒక నదిలో ఫొటో షూట్(Photo Shoot in River) చేయటానికి వెళ్లి అకస్మాత్తుగా నీటి మట్టం పెరిగి కొట్టుకుపోయారు. రెస్క్తూ సిబ్బంది సాయంతో వారిని బయటకు తీశారు. చాలా మంది శ్మశానాన్ని కీడుగా భావిస్తుంటారు. కానీ గుజరాత్​లో ఓ శ్శశానంలో ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. హైదరాబాద్​లో గతేడాది ఓ పోలీసు తన భార్యతో కలిసి పోలీస్ వాహనం ముందు స్టేషన్లో ఈ తరహా షూట్ చేయడం సంచలనమైంది. అయితే ఇద్దరూ పోలీసులే కావడం, శుభ కార్యం కావడంతో అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

Be Alert During Wedding Photography : తాజాగా కర్ణాటకలో ఓ వైద్యుడు ప్రభుత్వ ఆపరేషన్ థియేటర్​లో ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావటంతో ఆ వైద్యుడి ఉద్యోగం పోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఇలా తమ అభిరుచులకు తగ్గట్లుగా భిన్నంగా, రకరకాల ప్రాంతాల్లో ప్రీవెడ్డింగ్ షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో(Social Media) పాపులర్ అవుతున్నారు. ఒకప్పుడు ఫార్మల్ షూట్​గా ప్రారంభమైన ఫొటోషూట్ ఆధునీకరణ చెంది ప్రీవెడ్డింగ్ షూట్​గా మారింది. అత్యుత్సాహంతో అభాసుపాలవుతున్నవారు కొందరైతే, ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నవారు మరికొందరు.

ఆపరేషన్ థియేటర్​లో ప్రీ వెడ్డింగ్ షూట్​- వీడియో వైరల్​, డాక్టర్​ డిస్మిస్​!

Police Couple Pre Wedding Shoot in Police Dress : నెట్టింట ట్రెండ్​ అవుతున్న పోలీస్​ ప్రీ వెడ్డింగ్​ షూట్​.. సీవీ ఆనంద్​ రియాక్షన్​ చూశారా!

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.