Praja Palana Applications in Telangana : రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. నెలకు రూ.2,500 ఇచ్చే ఈ పథకానికి ఎక్కువమంది మహిళలకు జైకొట్టారు. ఆ తర్వాత రూ.500కే గ్యాస్ సిలిండర్లకు, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ అర్జీలు అందాయి. అభయహస్తం గ్యారెంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలకు అర్జీకి అవకాశం కల్పించగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి.
ఉచిత కరెంట్‌కు బకాయిల షాక్ - ఎరక్కపోయి ప్రజాపాలన దరఖాస్తుతో ఇరుక్కుపోయి!
Praja Palana Program in Telangana : అందిన దరఖాస్తుల్లో 1,09,00,662 అర్జీలను (Praja Palana) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. జిల్లాల వారీగా అప్‌లోడ్ అయిన దరఖాస్తులన పరిశీలిస్తే, గ్రేటర్ హైదరాబాద్ నుంచి అత్యధికంగా 18.97 లక్షలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి అత్యల్పంగా 1.37 లక్షలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు ఫారంలో తమ అర్హతలను బట్టి పలు పథకాలకు అభ్యర్థన పెట్టుకున్నారు. అలా పథకాలవారీగా విభజించి చూస్తే, అందిన మొత్తం అభ్యర్థనల సంఖ్య 4,56,35,666 అవుతుంది.
క్రమసంఖ్య | పథకం | అభ్యర్థనల సంఖ్య |
1 | మహిళలకు రూ,2500 (మహాలక్ష్మి) | 92,23,195 |
2 | రూ.500కే గ్యాస్ సిలిండర్ | 91,49,838 |
3 | ఇందిరమ్మ ఇళ్లు | 82,82,332 |
4 | 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహజ్యోతి) | 81,54,158 |
5 | రైతుభరోసా (భూమి ఉన్న రైతులకు రూ.15,000లు) | 38,73,956 |
6 | రైతుభరోసా (కౌలు రైతులకు రూ.15,000లు) | 2,63,616 |
7 | రైతుకూలీలకు రూ.12,000లు | 40,95,581 |
8 | ఉద్యమ అమరల కుటుంబాలకు 250 గజాల స్థలం | 23,794 |
9 | ఉద్యమకారులకు 250 గజాల స్థలం | 84,659 |
10 | దివ్యాంగుల పింఛన్లు | 2,77,292 |
11 | ఇతర పింఛన్లు | 22,07,245 |
జిల్లాల వారీగా దరఖాస్తుల సంఖ్య
క్రమసంఖ్య | జిల్లా | దరఖాస్తుల సంఖ్య |
1 | ఆదిలాబాద్ | 2,30,711 |
2 | భద్రాద్రి కొత్తగూడెం | 3,34227 |
3 | జీహెచ్ఎంసీ | 18,97,155 |
4 | హనుమకొండ | 2,54,472 |
5 | జగిత్యాల | 3,35,781 |
6 | జనగామ | 1,77,382 |
7 | జయశంకర్ భూపాలపల్లి | 1,37,454 |
8 | జోగులాంబ గద్వాల | 1,72,371 |
9 | కామారెడ్డి | 3,02,451 |
10 | కరీంనగర్ | 3,21,654 |
11 | ఖమ్మం | 4,90,902 |
12 | ఆసిఫాబాద్ | 1,63,647 |
13 | మహబూబాబాద్ | 2,47,213 |
14 | మహబూబ్‌నగర్ | 2,64,022 |
15 | మంచిర్యాల | 2,54,898 |
16 | మెదక్ | 2,25,594 |
17 | మేడ్చల్ మల్కాజిగిరి | 2,27,717 |
18 | ములుగు | 99,364 |
19 | నాగర్‌కర్నూల్ | 2,76,984 |
20 | నల్గొండ | 5,35,274 |
21 | నారాయణపేట | 1,70,479 |
22 | నిర్మల్ | 2,46,366 |
23 | నిజామాబాద్ | 4,80,294 |
24 | పెద్దపల్లి | 2,40,331 |
25 | రాజన్న సిరిసిల్ల | 1,92,622 |
26 | రంగారెడ్డి | 5,10,709 |
27 | సంగారెడ్డి | 3,91,565 |
28 | సిద్దిపేట | 3,25,214 |
29 | సూర్యాపేట | 3,75,094 |
30 | వికారాబాద్ | 2,84,275 |
31 | వనపర్తి | 1,74,794 |
32 | వరంగల్ | 2,90,834 |
33 | యాదాద్రి భువనగిరి | 2,68,812 |
Congress Six Guarantees in Telangana 2024 : మరోవైపు ఐదు గ్యారెంటీలు ఆశిస్తున్నవారు ఎందరున్నారనే అంచనా స్పష్టం కావడంతో, బడ్జెట్‌పై సర్కార్ కసరత్తు చేస్తోంది. అర్జీల ప్రకారం ఏయే పథకానికి ఎంత ఖర్చవుతుందనే వివరాలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని శాఖలు ప్రాథమిక అంచనాలు సమర్పించినట్లు సమాచారం. మొదట 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను (Gas Cylinder Scheme) వచ్చే నెలలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క
ఈ రెండు పథకాలకు విద్యుత్, గ్యాస్ కంపెనీల వద్ద వివరాలతో లబ్ధిదారులను ఎంపిక చేయడం సులువుగా ఉండడమే కారణమని సమాచారం. దీంతో పాటు మిగతా పథకాలతో పోలిస్తే నిధుల భారం కూడా కొంత తక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలు, గ్యాస్ కంపెనీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా కారణంతో నిధుల చెల్లింపు అప్పుడప్పుడు కొంత ఆలస్యమైనా ఇబ్బంది ఉండదని సూచించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఆరు హామీల్లో వీలైనన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది.
కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు - మరో మూడు పథకాల అమలుపై సర్కార్ కసరత్తు