ETV Bharat / state

లోక్​సభ ఎన్నికలకు రంగం సిద్ధం - మే 3వ తేదీ నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ - Postal Ballot Voting 2024

Postal Ballot Election Date in Telangana : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ఓటింగ్​ ప్రక్రియ దగ్గర పడుతున్న తరుణంలో విధులు నిర్వహించే అధికారులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్​ బ్యాలెట్​ ప్రక్రియ మే 3వ తేదీన నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Postal Ballot Eligible Voters
Lok Sabha Elections Postal ballot Voting in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 9:11 AM IST

Postal Ballot Election Date in Telangana : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్​ ద్వారా ఓటింగ్​ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం అవుతోంది. మే 3వ తేదీన ఈ పోస్టల్​ బ్యాలెట్​ ఓటింగ్​ను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. మే 13న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో పని చేసే సిబ్బంది, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈసీ వెసులుబాటు ఇచ్చింది. కొంత మంది వయోవృద్ధులు, దివ్యాంగులు మాత్రమే దీని ద్వారా ఇంటి నుంచి ఓటు వేయవచ్చు.

Postal Ballot Voting in Lok Sabha Polls 2024 : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. మే 3న ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఎనిమిదో తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. సాధారణ పోలింగ్‌ తేదీ కన్నా నాలుగు రోజుల ముందుగానే ఇది పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ముద్రణ(Postal Ballot Papers) మొదలుపెట్టి వచ్చే నెల రెండో తేదీలోగా పూర్తి చేయనున్నారు. ఈవీఎం యంత్రాలపైన ఉంచే బ్యాలెట్‌ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. పోస్టల్​ బ్యాలెట్​ పత్రాలను ఆయా జిల్లాలోనే ముద్రించాలని ఈసీ పేర్కొంది.

28,057 పోస్టల్‌ బ్యాలెట్‌ అఫ్లికేషన్లు ఆమోదం

Postal Ballot Voters in Telangana : ఎంపీ ఎన్నికలకు(Lok Sabha Polls 2024) సుమారు 13 లక్షల పోస్టల్ బ్యాలెట్​ పత్రాలను ముద్రించాలని అధికారులు అంచనా వేస్తున్నారు. 85 సంవత్సరాలు దాటిన వారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 4.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా. దివ్యాంగ ఓటర్లు సుమారు 5 లక్షల మంది నమోదయ్యారు. ఎన్నికల విధుల్లో సుమారు 2.60 లక్షల మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు. రాష్ట్రానికి చెందిన 15 వేల మందికిపైగా సిబ్బంది ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ పంపుతారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దివ్యాంగులు, వయోవృద్ధులు 12డీ దరఖాస్తు ఫారం నింపి రిటర్నింగ్‌ అధికారికి అందించాల్సి ఉంటుంది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు నిబంధనలు ఇవే...

ఈ నెల 18 నుంచి నామినేషన్లు పర్వం - నామపత్రాల సమర్పణకు ధూంధాంగా వెళ్లే యోచనలో అభ్యర్థులు - LOK SABHA ELECTION 2024

పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సర్వం సిద్ధం - పోలింగ్​కు ముందుగానే ఓటేసే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.