ETV Bharat / state

జల్సాలకు అలవాటు పడి చోరీలు - జైలుకెళ్లినా మార్పు రాలె - police arrested Theft Gang

Four Thief For Robbery in Ghatkesar : ఓ నలుగురు స్నేహితులు విలాసవంత జీవితానికి, జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు. గత నెల 7న ఘట్‌కేసర్‌లో ఓ ఇంటి తాళలు పగలుగొట్టి దొంగతనం చేశారు. అంతేకాకుండా వీరు గతంలో పలు చోరీలు కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లారు. అయినా వారిలో మార్పు రాలేదు. తాజాగా మరోసారి పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు.

Four Thief Broke into House and Robbed Gold in Ghatkesar
Four Thief For Robbery in Ghatkesar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 10:15 PM IST

Four Thief Broke into House and Robbed Gold in Ghatkesar : నలుగురు స్నేహితులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే తమ లక్ష్యంగా చేసుకున్నారు. అంతకముందే పోలీసులు పలు చోరీల కేసుల్లో ఆ నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. తాజాగా మరోసారి కూడా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఘట్‌కేసర్‌ సీఐ సైదులు, డీఐ అశోక్‌తేజ తెలిపిన వివరాల ప్రకారం జూన్​ 1న ఉదయం యంనంపేట చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ ఆటోలో వచ్చిన మల్లాపూర్‌లో నివాసముంటున్న బొందల మల్లేశ్​(40) భూపని ఆకాశ్​(27) మౌలాలీ హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన షేక్‌అల్తాఫ్‌(23) మల్కాజిగిరి వినాయకనగర్‌కు చెందిన వెంకటప్రసాద్‌(35)లను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. దీంతో విచారణ చేపట్టగా గత నెల 7న ఘట్‌కేసర్‌ కౌలస్య వెంచర్‌ కాలనీలో ఇంటితాళం పగలుగొట్టి 41 గ్రాముల బంగారు, 40 తులాలు వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు తెలిపారు. వీరిపై నాచారం, కీసర, కుషాయిగూడ, మేడిపల్లి ఠాణాల్లో 16 చోరీ కేసులున్నాయి.

ఎలా దొరికారంటే : ఈ నలుగురు నిందితులు రోజూ ఆటోలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. ఇద్దరు తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళుతారు. మరో ఇద్దరు ఎవరైనా వస్తున్నారేమోనని కాపలాగా ఉంటారు. ఈ విధంగానే ఘట్​కేసర్​లో కూడా చోరీ చేశారు. అయితే ఆ ప్రాంతంలో చోరీ వేళ విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. దీంతో పోలీసులకు ఆధారాలు దొరకలేదు.

విచారణలో భాగంగా డీఐ అశోక్‌ దొంగతనం జరిగిన ఇంటి సమీపంలో ఉన్న కల్లు వ్యాపారిని ప్రశ్నించాడు. ఘటన జరిగిన రోజు నలుగురు యువకులు ఆటోలో అరగంటసేపు వరకు ఉన్నారని, కల్లు కావాలని అడిగారని, వారిని డబ్బులు అడిగితే తర్వాత ఇస్తామని చెబితే కల్లు ఇవ్వలేదని చెప్పాడు. ఆటోలో ఉన్న నిందితుల గుర్తులను వివరించారు. దీంతో సమీపంలో ఉన్న పలు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయిన ఆటో నంబరు ఆధారంగా నలగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

యాదాద్రి థర్మల్‌ పవర్ ప్లాంట్​లో రూ.కోట్ల విలువైన సామగ్రి చోరీ - ఇంటి దొంగలను పట్టుకున్న నల్గొండ పోలీసులు - YTPS Plant Thieves Arrested

బ్యాంకు ముందు నిలిపి ఉంచిన స్కూటీ డిక్కీలో నుంచి రూ.2 లక్షలు చోరీ - అలా వెళ్లి ఇలా వచ్చేసరికే! - Two Lakh Rupees Stolen Scooty Dicky

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.