ETV Bharat / state

హైదరాబాద్​లో 'మత్తు' కలకలం - రూ.8.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం - HUGE DRUG RACKET BUST IN HYDERABAD - HUGE DRUG RACKET BUST IN HYDERABAD

Drug Racket Bust in Hyderabad Today : హైదరాబాద్​లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 8.5కోట్ల విలువైన 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

Drug Racket Arrest In Bowenpally Hyderabad
Drug Racket Arrest In Bowenpally Hyderabad (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 10:04 AM IST

Updated : Aug 26, 2024, 6:13 PM IST

Drug Racket Arrest In Bowenpally Hyderabad : హైదరాబాద్​ బోయిన్​పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి రూ.8.5 కోట్లు విలువైన 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు 3సెల్​ఫోన్లు సీజ్ చేశారు.

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన కుంచాల నాగరాజు కుటుంబం బతుకుదెరువు కోసం షాపూర్​కు వచ్చింది. పదవ తరగతి వరకూ చదివిన నాగరాజు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. నగరంలో పలు కాంట్రాక్టులు ఒప్పుకుని పని చేసస్తున్నాడు. ఇదే క్రమంలో గోసుకొండ అంజిరెడ్డి అనే వ్యక్తి అతనికి పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ తయారు చేసేందుకు గోదాములు కట్టే పనిని అతనికి అప్పగించాడు. తనకు ఉన్న పరిచయాలతో నాగరాజుకు పలు కాంట్రాక్టులు అంజిరెడ్డి ఇప్పించడంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది.

అంజిరెడ్డి పలు దుకాణాలకు, వ్యక్తులకు తరచూ డ్రగ్స్ విక్రయిస్తూ సులభంగా డబ్బు సంపాదిస్తుండటం నాగరాజు గమనించాడు. జూన్​లో బొంతుపల్లిలోని తన మరో డ్రగ్స్ తయారి యూనిట్ వద్దకు నాగారాజును తీసుకెళ్ళిన అంజిరెడ్డి మూడు ప్లాస్టిక్ కవర్లను ఇచ్చి రహస్య ప్రదేశంలో దాచమని చెప్పాడు. నాగరాజును తన వ్యాపారంలో భాగస్వామ్యం అవ్వాలని కోరాడు. డ్రగ్స్​ను ఎంత ఎక్కువ మందికి అమ్మితే అంత డబ్బు వస్తుందని చెప్పడంతో నాగారాజు ఆశపడ్డాడు. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. గుమ్మడిదలలోని అంజిరెడ్డికి చెందిన డ్రగ్స్ తయారి యూనిట్​పై పోలీసులు దాడి చేసి అతడిని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఆదివారం రాత్రి ముగ్గరు వ్యక్తులు జిన్నారం నుంచి ఎఫిటమైన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు వారు ఏ దారిలో వస్తున్నారు వంటి వివరాలు తెలుసుకుని అక్కడ కాపలా కాశారు. బోయిన్​పల్లి పోలీసులను అలర్ట్ చేశారు. సుచిత్ర నుంచి ప్యారడైజ్​కు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న మహేంద్ర గ్జైలో కారును వెంబడించారు. డైరీ ఫార్మ్ రహదారిపై పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.

కిలో డ్రగ్స్ కోటి రుపాయలు : అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా కారు డిక్కీలో మూడు పింక్ కవర్లను గుర్తించారు. వాటిని తెరిచి చూడగా అందులో ఎఫిటమైన్ అనే డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 8.582 కిలోల మత్తుపదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. దీని విలువ రూ.8.50 కోట్లు ఉంటుందని వెల్లడించారు. డ్రగ్స్​తో పాటు నిందితుల నుంచి కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎఫిటమైన్ డ్రగ్​ విలువ కిలో కోటి రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా వాసి నాగరాజు, కారు డ్రైవర్ వినోద్, మరో పెడ్లర్‌ను అరెస్టు చేశారు.

తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్‌ బాధితులు - తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు - TGNAB IDENTIFIED 40000 DRUG ADDICTS

"నాగరాజు తన అనుచరులు వినోద్‌, శ్రీశైలంతో కలిసి డ్రగ్స్‌ దందా చేస్తున్నాడు. గతంలో గుమ్మడిదలలో ఆల్ఫాజోలం తయారీ సంస్థను సీజ్‌ చేశాం. ఆల్ఫాజోలం తయారు చేస్తున్న అంజిరెడ్డి శిష్యుడు నాగరాజు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. విచారణ తర్వాత నిందితులను కస్టడీలోకి తీసుకుంటాం. ఘటనలో ఇంకెవరైనా నిందితులు ఉన్నారా అనేది ఆరా తీస్తున్నాం." - కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సీపీ

ఎఫిటమైన్ డ్రగ్​ను బహిరంగ మార్కెట్​లో కిలో కోటి రూపాయలకు పైగానే విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జైల్లో ఉన్న అంజిరెడ్డిని పిటి వారెంట్​పై అరెస్ట్ చేసిన కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎఫిటమైన్​ డ్రగ్స్ ద్వారా యువతీ యువకులను డ్రగ్స్​ వైపు మళ్లించే అవకాశం ఉందని హైదరాబాద్ సీపీ తెలిపారు. నేరుగా పీల్చడం, కూల్‌డ్రింక్, మంచినీటిలో కలుపుకోవడం, ఇంజెక్షన్ల ద్వారా మత్తును పొందుతారని తెలిపారు.

డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా మహిళ : మరోవైపు రాజేంద్రనగర్‌ పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియాకు చెందిన మహిళను అరెస్టు చేశారు. మరో నలుగురు పరారిలో ఉన్నారు. నిందితురాలి నుంచి 50గ్రాముల ఎండీఎంఏ, 25గ్రాముల కొకైన్​ను స్వాధినం చేసుకున్నారు. వీటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్​లో సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దంపతులతో పాటు మరో ముగ్గురు కలిసి మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం.

నగరంలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం - ఆన్‌లైన్‌ వేదికగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు - DRUGS BUST IN HYDERABAD

స్నాప్​చాట్​లో డీలింగ్స్ - కోడ్​ భాషలో స్మగ్లింగ్ - నైజీరియన్ డ్రగ్స్ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు - Snapchat Drugs Case In Hyderabad

Last Updated : Aug 26, 2024, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.