Cyber Fraud Chinese Gang Arrest by Telangana Police : సింగం సినిమాలో హీరో సూర్య వేరే దేశానికి వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో డ్రగ్ దందా చేస్తున్న ముఠా గురించి కూపీ లాగుతాడు. అలానే కరీంనగర్ పోలీసులు కంబోడియా దేశంలో చైనీస్‌కు సంబంధించిన కంపెనీలో సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాకు రాజన్న సిరిసిల్ల పోలీసులు చెక్ పెట్టారు. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసు చేధించారు. అనంతరం ఈ కేసులో మరో 500 నుంచి 600 మంది ఇండియాకు చెందిన బాధితులు ఉన్నారని గుర్తించారు.
Chinese Company Cyber Fraud Case : ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా పోలీస్ కార్యాలయానికి నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల పట్టణం పెద్దూర్ గ్రామానికి చెందిన అతికం లక్ష్మీ అనే మహిళ వచ్చి తన కుమారుడు శివ ప్రసాద్ జగిత్యాల జిల్లా కోడిమ్యాల గ్రామానికి చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే ఏజెంట్‌కి రూ.1,40,000 ఇచ్చి కంబోడియా దేశానికి వెళ్లాడని తెలిపింది. తన కుమారుడు ఆ దేశంలో చిక్కుకున్నాడని, రక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేశారు.
ఆన్లైన్ షాపింగ్ తెగ చేస్తుంటారా? ఈ టిప్స్ ఫాలో అయితే మీరెప్పుడూ సేఫ్! - Online Safe Shopping Tips
SP Mahajan on Cyber Fraud Case : శివ ప్రసాద్ మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సప్ ద్వారా మాట్లాడగా ఇక్కడ చైనీస్‌కి చెందిన కంపెనీ తన పాస్‌పోర్ట్ తీసుకొని సైబర్ నేరాలు చేపిస్తున్నారని తనలాగే భారతదేశానికి చెందిన 500 నుంచి 600 మంది బాధితులు ఉన్నారని అన్నాడు. వారందరితో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ఇండియన్ ఫోన్ నంబర్స్ ఇచ్చి లాటరీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ చేపిస్తున్నారని తెలిపాడు. టాస్క్‌లు ఇచ్చి వాటిని చేస్తే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని సైబర్ మోసాలు చేయాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
బాధితుడి ఆవేదన తెలుసుకున్న సిరిసిల్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని కంబోడియాలో ఉన్న ఇండియన్ ఏంబసీ అధికారులతో మాట్లాడి బాధితుని వివరాలు పంపించి విచారణ చేశారు. అక్కడ స్థానిక పోలీసులతో గాలింపు చర్యలు చేయగా బాధితుడిని రక్షించారు. తనను స్వదేశానికి తీసుకువస్తున్నామని ఎస్పీ తెలిపారు. తనతో పాటు ఇండియాకు చెందిన వారిని కాపాడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
"బాధితుడు ఇచ్చిన తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తే అంతర్జాతీయ ముఠా వివరాలు దొరికాయి. శివ ప్రసాద్‌ను కాపాడి దేశానికి తీసుకువస్తున్నాం. మిగిలిన భారతీయులను త్వరలోనే రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీని కోసం హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీతో కలిసి పనిచేస్తాం. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే యువకులు లైసెన్స్ కలిగిన ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలి." - అఖిల్ మహాజన్, కరీంనగర్ జిల్లా ఎస్పీ
International Cyber Fraud Case : ఈ కేసులో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతను పదివేలు కమిషన్ తీసుకుని లఖ్‌నవూకి చెందిన సదాకత్ అనే వ్యక్తి దగ్గరకు పంపాడు. సదాకత్ పదివేలు కమిషన్ తీసుకుని పూణేలో ఉన్న అబిద్ ఆన్సారీకి పంపగా అతను దుబాయ్‌లో ఉన్న షాదబ్ అనే వ్యక్తికి తీసుకువెళ్లారు. షాదబ్ దుబాయ్ నుంచి కంబోడియాకు బాధితుడిని తీసుకువెళ్తాడని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్‌లో జగిత్యాలకు చెందిన కంచర్ల సాయిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు.