ETV Bharat / state

ఆరోజు రాష్ట్రంలోని పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం - modi coming to telangana on monday

PM Narendra Modi Going To open Railway Projects : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.621 కోట్ల విలువ గల పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

BJP Vijaya Sankalpa Yatra In Telangana
PM Narendra Modi Going To open Railway Projects
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 2:13 PM IST

Updated : Feb 24, 2024, 2:27 PM IST

PM Narendra Modi Going To open Railway Projects : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రంలోని పలు రైల్వే అభివృద్ధి (Railway Projects in Telangana) పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 500పైగా అమృత్​ భారత్​ స్టేషన్ల పనులను ప్రారంభించనున్నారు. 1500 రైల్ ఫ్లై ఓవర్​, అండర్ పాస్​లకు భూమి పూజ చేయడంతో పాటు జాతికి అంకితం చేస్తారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న 15 అమృత్​ భారత్​ స్టేషన్లు, రూ.169 కోట్లకు పైగా నిధులతో 17 రైల్వే ఫ్లె ఓవర్లు, అండర్​ పాస్​లు నిర్మించనున్నారు. అంతేకాకుండా రూ.221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్వే ఫ్లై ఓవర్​, రైల్ అండర్ పాస్​లను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు రూ.621 కోట్లు కాగా, రాష్ట్రంలో మొత్తం 40 అమృత్​ భారత్​ స్టేషన్లు పునరాభివృద్ధికి రూ.224 కేట్లు ఖర్చు చేస్తున్నారు.

6 గ్యారంటీలు అమలు చేయమంటే, లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని అడగడం ఏంటి? : కిషన్‌రెడ్డి

ఇందులో రూ.894 కోట్ల అంచనా వ్యయంతో గత ఆగస్టులో 21 అమృత్​ భారత్ (Amrit Bharat Programs)​ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాగా తెలంగాణలో కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి (Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ మిషన్​ 'జ్ఞాన్​'తో '400'కు తగ్గేదేలే! మోదీ, షాతో పాటు ఆ ఇద్దరు కూడా రంగంలోకి!

Amrit Bharat Programs in Telangana : అమృత్ భారత్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలోని స్టేషన్ల ఆధునికీకరణ, ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి రూ.1853కోట్లు కేటాయించారని జీఎం అరుణ్‌ కుమార్ తెలిపారు. ఈ నెల 26వ తేదీన ప్రధానీ మోదీ ఆన్‌లైన్​లో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని అరుణ్‌ కుమార్ తెలిపారు. 57 అమృత్ స్టేషన్ల కోసం రూ.925 కోట్లు, 156 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల కోసం రూ.927 కోట్ల కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

South Railways GM Arun Kumar on Railway Projects in Telangana : దేశవ్యాప్తంగా 554 అమృత్ స్టేషన్లు, 1500 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలకు నిధులు శంకుస్థాపన చేయనున్నారు. విడతలవారీగా రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు అమృత్ భారత్‌ కార్యక్రమంలో కేంద్రం భారీగా నిధుల కేటాయిస్తుస్తోందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.

మల్కాజ్​గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి సిద్ధం : ఈటల ​

Last Updated : Feb 24, 2024, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.