PM Modi Tweet on Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క - సారలమ్మ జాతర(Sammaka-Saralamma Jatara) ఒకటి అంటూ పీఎం మోదీ అన్నారు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అంటూ హర్షం వ్యక్తం చేశారు. మనమంతా ఆ వన దేవతలకు ప్రణమిల్లాలని సూచించారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ఎక్స్ వేదికగా ప్రధాని(Modi) ట్వీట్ చేశారు.
"గిరిజనుల అతి పెద్ద పండుగలలో సమ్మక్క - సారలమ్మ జాతర ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'బండెనక బండి కట్టి - పదహారు బండ్లు కట్టి' - ఊరుఊరంతా మేడారం జాతరకు
సమ్మక్క - సారలమ్మ త్యాగనిరతి స్ఫూర్తిదాయకం : తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ అయిన మేడారం జాతర(Medaram Jatara 2024) సందర్భంగా భక్త కోటికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. ప్రకృతి కోసం, ప్రకృతిని నమ్ముకున్న సామాన్య ప్రజల కోసం ప్రకృతి శక్తులుగా మారి బలాఢ్యులపై వీరోచితమైన పోరు సాగించడం ద్వారా పరాశక్తులుగా కోట్ల మంది ప్రజల పూజలు అందుకుంటున్న సమ్మక్క- సారలయ్మల త్యాగనిరతి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో జీవించు అన్న భారతీయ సనాతన ధర్మ సందేశాన్ని మనకు సమ్మక్క-సారలమ్మ చరిత్ర(Samakka-Saralamma History) తెలియజేస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
"తెలంగాణ ప్రజల, తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ అయిన మేడారం జాతర సందర్భంగా భక్తకోటికి శుభాకాంక్షలు. ప్రకృతి కోసం, ప్రకృతిని నమ్ముకున్న సామాన్య ప్రజల కోసం ప్రకృతి శక్తులుగా మారి బలాఢ్యులపై వీరోచిత పోరు సాగించి పరాశక్తులుగా కోట్ల మంది ప్రజల పూజలందుకుంటున్న సమ్మక్క - సారలమ్మ ల త్యాగనిరతి స్ఫూర్తిదాయకం. ప్రకృతిని ప్రేమించు ప్రకృతితో జీవించు అన్న భారతీయ సనాతన ధర్మ సందేశాన్ని మనకు సమ్మక్క -సారలమ్మ చరిత్ర తెలియజేస్తుంది." - ఎం.వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
వైభవంగా సాగుతున్న మేడారం జాతర : నేటి నుంచి నాలుగు రోజుల పాటు సమ్మక్క-సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే వన దేవతల జాతర పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ అతిపెద్ద ఆదివాసీ పండగకు ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు అధిక మొత్తంలో వస్తారు. మేడారం జాతరకు దాదాపు కోటి మంది పైగా భక్తులు దర్శనాలు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
వనమంతా జనమయ్యే వేళాయే - నేటి నుంచి మేడారం మహా జాతర షురూ
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్