ETV Bharat / state

బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? - అధికారులపై ఎన్​డీఎస్​ఏ కమిటీ ప్రశ్నల వర్షం

NDSA Experts Committee on Kaleshwaram Project : మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన డిజైన్స్, నాణ్యత, నిర్వహణ అంశాలపై నిపుణుల కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. సంబంధిత విభాగాల ఇంజినీర్లతో సమావేశమై వివరాలను సేకరించింది. విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లుతోనూ చర్చించిన కమిటీ మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు కారణాల గురించి ఆరా తీసింది. ఇవాళ సీడీవో ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కమిటీ సమావేశమైంది.

Medigadda Barrage issue
NDSA Committee Meeting On Medigadda Barrage
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 9:34 AM IST

Updated : Mar 21, 2024, 12:01 PM IST

మేడిగడ్డ ఇంజినీర్లతో ఎన్డీఎస్ఏ కమిటీ మీటింగ్ - కీలక వివరాలు సేకరించిన బృందం

NDSA Experts Committee on Kaleshwaram Project : ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ రెండో రోజు ఇంజినీర్లతో సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డిజైన్ల విషయమై కమిటీ ఆరా తీస్తోంది. డిజైన్లు రూపొందించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో నిన్న సమావేశమైన కమిటీ ఇవాళ కూడా భేటీ కొనసాగిస్తోంది. బాధ్యులైన ఇంజినీర్లతో విడివిడిగా సమావేశమవుతున్న చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సభ్యులు డిజైన్లకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు.

బుధవారం రోజు బ్యారేజీలకు సంబంధించి భాగమైన ఇంజినీర్లతో సమావేశమైన ఎన్​డీఎస్​ఏ కమిటీ, ఆనకట్టల నిర్వహణ బాధ్యతలు చూసే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం నుంచి సమగ్ర వివరాలు కోరింది. ప్రత్యేకించి 2019లో సమస్యలు ఉత్పన్నమైనప్పటి నుంచి తీసుకున్న చర్యలు, చేపట్టిన తనిఖీల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన గుత్తేదార్ల ప్రతినిధులతోనూ కమిటీ ఇవాళ సమావేశమైంది.

మూడు ఆనకట్టల మోడల్స్ ను కమిటీ రేపు పరిశీలించనుంది. గతంలో ఈఎన్సీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మురళీధర్, రామగుండం ఈఎన్సీగా ఉండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నల్లా వెంకటేశ్వర్లుతో కూడా కమిటీ సమావేశమైంది. మొదట వెంకటేశ్వర్లుతో సమావేశమైన కమిటీ మూడు ఆనకట్టల అంశాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.

ఇన్వెస్టిగేషన్స్ మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాల గురించి తెలుకున్నారు. మురళీధర్‌తో విడిగా సమావేశమైన కమిటీ మేడిగడ్డలో పియర్స్ ఎందుకు కుంగి ఉండవచ్చో అడిగారు. దిగువన ఇసుక కదలిక, సీకెంట్ ఫైల్స్ తదితరాల గురించి అడిగినట్లు సమాచారం. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో కమిటీ విడివిడిగా సమావేశమైంది. వ్యాప్కోస్ సంస్థ చేసిన సర్వే దాని తనిఖీ గురించి ఆరా తీశారు. డీపీఆర్, డిజైన్ల గురించి ప్రధానంగా వివరాలు తెలుసుకున్నారు.

ముగిసిన ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటన - బ్యారేజీల కీలక వివరాలు సేకరించిన బృందం

NDSA Committee On Medigadda Damage : హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్స్‌కు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి మొదట పెట్టిన గడువు, ఆ తర్వాత తక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన పరిస్థితి, నిర్మాణ క్రమంలో తీసుకున్న జాగ్రత్తలు, క్వాలిటీ కంట్రోల్ గురించి ఇంజినీర్లను అడిగారు. తక్కువ సమయంలోనే పూర్తి చేసినపుడు నాణ్యత గురించి ఎటువంటి తనిఖీలు చేశారని ప్రశ్నించిన కమిటీ ఎక్కడైనా లోపాలు ఉంటే ఎవరి దృష్టికి తీసుకెళ్లారని ఆరా తీసినట్లు తెలిసింది.

ఆనకట్టల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు సంబంధించి కూడా వివరాలు పూర్తిగా తీసుకున్నట్లు సమాచారం. నిర్వహణకు సంబంధించిన పర్యవేక్షణ ఎలా జరిగిందని, 2019 లో సమస్యలు వచ్చినప్పటి నుంచి తీసుకున్న చర్యలు చేసిన తనిఖీల గురించి ఆరా తీశారు. వాటి అన్నింటికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీ సూచించింది. ఆనకట్టల డిజైన్స్, నాణ్యత, నిర్వహణ అంశాలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. వివిధ దశల్లో మానవ లోపం వల్లే సమస్య ఉత్పన్నమైనట్లు భావిస్తున్న కమిటీ ఆ దిశగానే ఇంజినీర్ల నుంచి సమాచారం రాబట్టుతున్నట్లు తెలుస్తోంది.

Medigadda Barrage issue : ఏ ఆమోదానికి ఎవరు బాధ్యులు? జవాబుదారీతనం ఎవరింది? లోపాలను గుర్తించాల్సిన వారు ఎవరు? ఏం చేశారు? అన్న కోణంలో ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. అయితే కొందరు ఇంజినీర్లు అడిగిన వాటికి సమాధానం ఇవ్వకపోవడం, సంబంధం లేనట్లుగా వ్యవహరించడంపై చంద్రశేఖర్ అయ్యర్ కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇవాళ కూడా డిజైన్స్‌కు సంబంధించి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో కమిటీ సమావేశం కానుంది.

క్షుణ్నంగా పరిశీలిస్తూ, కొలతలు తీస్తూ, కారణాలు అన్వేషిస్తూ - మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్డీఎస్​ఏ నిపుణులు

మేడిగడ్డను సందర్శించిన నిపుణుల బృందం- రోజంతా సాగిన బ్యారేజీ పరిశీలన

Last Updated : Mar 21, 2024, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.