ETV Bharat / state

నాగోబా జాతరకు వేళాయే - ఇవాళ అర్ధరాత్రి మహా పూజతో ప్రారంభం కానున్న ఆదివాసీల పండుగ - adilabad nagoba jatara

Nagoba Jathara 2024 : ఆదివాసీల ఆచార వ్యవహారాల పండుగ నాగోబా జాతర. ఇవాళ అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజతో ప్రారంభం కానుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో గోదావరి నదిలోని గంగాజలం కోసం పక్షం రోజులుగా సాగిన మెస్రం వంశీయుల పాదయాత్ర ఇప్పటికే కేస్లాపూర్‌ చేరుకుంది. ఈరోజు అర్ధరాత్రి నాగదేవతకు గంగాజలంతో అభిషేకం చేయడంతో మహాక్రతవు ప్రారంభం కానుంది.

Nagoba Jatara
Nagoba Jatara 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 10:45 AM IST

ఆదివాసీల నాగోబ జాతర ఎక్కడ ఉన్నా ఆరోజు అందరూ కలవాల్సిందే

Nagoba Jatara 2024 : దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే మెస్రం వంశీయుల జీవన విధానం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో వెలసిన నాగోబా జాతరతో ముడిపడి ఉంది. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలకు ఈ జాతర తలమానికంగా నిలుస్తోంది. నాగోబా జాతరతో అందరూ ఒకేచోట కలవాలనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఎడ్లబండ్లపై రావడం, మర్రి చెట్టు నీడన సేద తీరడం, గోదావరి నదికి పదిహేను రోజుల పాటు కాలినడకన వెళ్లి తీసుకొచ్చిన గంగాజలంతో అర్ధరాత్రి తుడుం మోతలు, సన్నాయి వాద్యాల నడుమ నాగోబా దేవతను అభిషేకం చేసే మహా పూజతో జాతర ప్రారంభమవుతుంది. జొన్న గట్క, సాంబారు, మినప పప్పు, నువ్వుల నూనె సహా పొలంలో పండించి సొంతంగా తెచ్చుకునే తొమ్మిది రకాల దినుసలతో నాగోబాకు నైవేద్యం సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది.

గంగాజలం కోసం మెస్రం వంశస్థుల పయనం - త్వరలో నాగోబా జాతర ప్రారంభం

దేశంలో మెస్రం వంశీయులు ఎక్కడ నివసించినా నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్‌లో కలవాలనేది ఆచారంగా వస్తోంది. ఎడ్లబండ్లనే గుడారాలుగా మార్చుకొని ప్రతి ఒక్కరూ యోగక్షేమాలను తెలుసుకోవడమే కాదు, భవిష్యత్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం సంప్రదాయంగా విరాజిల్లుతోంది. చెట్టు, పుట్ట, చేను, పశుపక్షాదులన్నింటిలోనూ దైవాన్ని చూసే మెస్రం వంశీయులు, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటారు. పెళ్లయిన మహిళలు భేటి పేరిట నాగోబా సన్నిధిలో మొక్కు తీర్చుకుంటేనే మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తోంది. ప్రతి ఒక్కరూ మర్రి చెట్ల కింద సేదతీరుతారు. అందరూ కలిసి ఆ రాత్రి యోగక్షేమాలను తెలుసుకుంటూ సమయాన్ని గడుపుతారు. అందరూ కలిసి భోజనాలు చేసి సంతోషంగా ఉంటారు.

వైభవంగా నాగోబా జాతర.. తరలివస్తోన్న అడవిబిడ్డలు

"నాగోబా ప్రత్యేకత ఏంటంటే చెట్లను, భూమిని, పశువులను అన్నింటినీ మొక్కుతాం. గోండు జాతిలో మేము మెస్రం వంశీయులం. మాకు నాగోబా దేవత. అలా ప్రతి ఒక్క వంశీయులకు వాళ్ల దేవుళ్లు ఉంటారు. పెళ్లైన తర్వాత వాళ్లకు పిల్లలు పుడితేనే వాళ్లు నాగదేవతను చూడాలి. అప్పటి వరకు చూడరు. ఇది ఆచారం. అప్పుడే ఆమెను కోడలిగా ఆహ్వానిస్తారు. ఇది తరతరాలుగా వస్తుంది." - మెస్రం వంశీయులు

Nagoba Jatara in Adilabad 2024 : చనిపోయినవారికి దేవత సన్నిధిలో కర్మకాండ చేస్తేనే మోక్షం లభిస్తుందనేది మెస్రం వంశీయుల విశ్వాసంగా కొనసాగుతోంది. అక్షరాస్యులైనా నిరక్ష్యరాస్యులైనా చిన్నపిల్లలైనా చివరికి జీవిత చరమాంకంలోకి చేరుకున్న వృద్ధులైనా ఇలా అందరూ నాగోబాకు సమానులనే భావన మెస్రం వంశీయుల ఆచారంగా కొనసాగుతోంది. ఎంత నిష్టతో పూజలు చేస్తే జనావళికి అంత మేలు జరుగుతుందనే విశ్వాసం బలంగా ఉండిపోయింది.

జనసంద్రంగా నాగోబా జాతర.. కిక్కిరిసిన క్యూలైన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.