ETV Bharat / state

మైనర్ బాలికను చాకుతో పొడిచిన ప్రేమోన్మాది - అడ్డొచ్చినా తల్లిదండ్రుల పైనా దాడి - Murder Attempt on Minor Girl - MURDER ATTEMPT ON MINOR GIRL

ప్రేమించాలంటూ మైనర్ బాలిక వెంటపడ్డ యువకుడు - అంగీకరించకపోవడంతో ఇంటికి వెళ్లి చాకుతో దాడి

Murder Attempt on Minor Girl for Marriage in Bapatla
Murder Attempt on Minor Girl for Marriage in Bapatla (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 4:41 PM IST

Murder Attempt on Minor Girl for Marriage in Bapatla : హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకుంటోంది ఆ చిన్నారి. రోజూ బడికి వెళ్తూ రేపటి భవిష్యత్తు కోసం కలలు కంటోంది. తన చదువు కోసం తల్లిదండ్రుల కష్టం వృధా కావొద్దని భవిష్యత్తులో మంచి స్థాయిలో స్థిరపడి మంచిగా చూసుకోవాలని పూర్తి శ్రద్ధపై పెట్టింది. కానీ ఆ అమ్మాయిపై ఓ యువకుడి కళ్లుపడ్డాయి. ప్రేమించాలంటూ వెంట పడ్డాడు. మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిలో ప్రేమలో దింపాలని ప్రయత్నించాడు. తన ప్రేమను అంగీకరించాలంటూ వెంట తిరిగాడు. పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా వేధింపులకు దిగాడు. అయినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. పెళ్లికి అంగీకరించలేదు. ఈ విషయం ఇంట్లో చెప్పిందో లేదో కానీ ఆ ప్రేమికుడు ప్రేమోన్మాదిగా మారాడు. తన ప్రేమను అంగీకరించాలంటూ ఆ బాలికపై చాకుతో దాడి చేశాడు. అడ్డువచ్చిన ఆమె తల్లిదండ్రులపై దాడిగి దిగాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో చోటుచేసుకుంది.

పెళ్లి చేసుకోమంటే అత్యాచారం చేసి ఉరేసి చంపేసిన ప్రేమికుడు - A CASE OF SUSPICIOUS DEATH NALGONDA

పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాలలో ప్రేమోన్మాది బరితెగించాడు. తన ప్రేమను అంగీకరించడం లేదంటూ బాలిక ఇంటికెళ్లి మరీ చాకుతో దాడికి తెగబడ్డాడు. చెరుకుపల్లిలోని ఓ స్కూల్లో చదువుతున్న బాలిక వెంటపడుతున్న రాజోలు భార్గవరెడ్డి పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలంటూ రోజూ వెంటపడుతున్నాడు. కానీ ఆ బాలిక అంగీకరించరించలేదు.

తల్లిదండ్రులపై చాకుతో దాడి : దీంతో అమ్మాయిపై కోపాన్ని పెంచుకున్నాడు. కాగా స్కూళ్లకు దసరా సెలవులు బాలిక ఇంటిపట్టునే ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన అతడు సరైన సమయం కోసం వేచి చూశాడు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికెళ్లి గొడవ చేశాడు. వెంట తెచ్చుకున్న చాకుతో బాలికపై దాడి చేశాడు. అడ్డువచ్చిన బాలిక తల్లిదండ్రులనూ దారుణంగా పొడిచాడు. తీవ్ర గాయాలైన ముగ్గురినీ రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమకత్తికి మరో ప్రాణం బలి - ఉన్మాది దాడిలో యువతి మృతి - అనంతరం యువకుడి ఆత్మహత్యాయత్నం - HYDERABAD MAN KILLS EX GIRLFRIEND

ట్యూషన్​ టీచర్​తో మైనర్ ప్రేమాయణం​- దూరం పెట్టిందని 'క్యాష్​ ఆన్​ డెలివరీ' ఆర్డర్లతో రివెంజ్​​! అసలేం జరిగిందంటే? - Cash On Delivery Torture

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.