Family Suicide In Shameerpet : వారి చిన్నారికి క్యాన్సర్ వ్యాధి సోకింది. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటే, ఆ కుటుంబాన్ని క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన పేదరికం పీడిస్తుంది. దంపతులు ఇద్దరు కూలికి వెళ్తేనే కానీ పూట గడిచే పరిస్థితి. కుమార్తె క్యాన్సర్కు వైద్యం అందించలేని దైన్య పరిస్థితి కారణంగా భార్యాభర్తల మధ్య కలతలు, వీటన్నింటినీ తట్టుకోలేని ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. పిల్లలను తీసుకొని చెరువులో దూకింది. ఈ హృదయ విదారక ఘటన షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
చికిత్సకు డబ్బులు లేక గొడవలు : సీఐ శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం ములుగు మండలానికి చెందిన స్వామి, మనోహరాబాద్ గ్రామానికి చెందిన భానుప్రియ దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి దేవాన్ష్ ఆనంద్ (5), దీక్ష(4) ఇద్దరు సంతానం కలిగారు. దీక్షకు పుట్టుకతో క్యాన్సర్ వ్యాధి సోకింది. దీంతో ఆమెకు పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఓవైపు చికిత్సకు డబ్బులు లేక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి భార్యపై దాడులు చేసే వరకు దారి తీశాయి. శుక్రవారం రాత్రి స్వామి తన భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
హృదయ విదారకం - నిర్జీవమైన అమ్మ - 2 రోజుల పాటు జోలిలోనే రెండేళ్ల పాప - Mother committed suicide in ap
పిల్లలతో కలిసి చెరువులోకి : వెంటనే భార్య, పిల్లలు కనిపించడం లేదంటూ స్వామి ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం సాయంత్రం శామీర్పేట్ పెద్ద చెరువులో ముగ్గురు దూకినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో వెతికించగా భానుప్రియ, దీక్ష మృతదేహాలు బయటపడ్డాయి. వేదాన్ష్ మృతదేహం ఆదివారం ఉదయం నీటిలో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకే ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో ములుగులో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
నమ్మించి మోసం చేసిన కుమారుడు - ఆవేదనతో తల్లిదండ్రుల ఆత్మహత్య - Couple Commits Suicide Due to Debts
మెదక్ జిల్లాలో దారుణం - పోలీస్ కేసు, ఒంటరితనంతో తల్లీకుమార్తెల ఆత్మహత్య!