ETV Bharat / state

మర్డర్ కేసు నమోదు వల్ల 8 మంది విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ నాశనం చేసింది : కల్వకుంట్ల కవిత - MLC Kavitha Fires On Congress

MLC Kavitha Visit Bhodhan Hostel In Kamareddy : బోధన్​ హస్టల్​ విద్యార్థి మరణించడం చాలా బాధకరమైన విషయం అని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్​ మరణించడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లేకపోవడం వల్ల జరిగిన ఘటనలో ఒకరు చనిపోవడం, ఎనిమిది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందని ఆమె పేర్కొన్నారు. ఆ ఎనిమిది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.

MLC Kavitha Visit Bhodhan Hostel In Kamareddy
MLC Kavitha Visit Bhodhan Hostel
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 8:09 PM IST

మర్డర్ కేసు నమోదు వల్ల 8 మంది విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ నాశనం చేసింది : కల్వకుంట్ల కవిత

MLC Kavitha Visit Bhodhan Hostel In Kamareddy : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన హర్యల వెంకట్ బోధన్ హాస్టల్​లో జరిగిన చిన్న సంఘటనలో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని ఎమ్మెల్సీ కవిత అవేదన వ్యక్తం చేశారు. వెంకట్ మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లేకపోవడం వలన జరిగిన ఘటనలో ఒకరు చనిపోవడం ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందని పేర్కొన్నారు. మర్డర్ కేసు నమోదు కావడం వల్ల 8 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అరోపించారు.

మేడిగడ్డపై దుష్ప్రచారాన్ని ఆపి - వర్షాకాలంలోపు మరమ్మతులు చేపట్టండి : బీఆర్ఎస్

"బోధన్​ హస్టల్​ విద్యార్థి మరణించడం చాలా బాధాకరం. హర్యల వెంకట్​ మరణించడం తీవ్రంగా కలిచి వేసింది. హాస్టల్​ వార్డెన్​ వాచ్​ మెన్​ లేకపోవడం వల్ల జరిగిన ఘటనలో ఓ విద్యార్థి మరణించడం ఎనిమిది విద్యార్థులపై మర్డర్​ కేసు నమోదు చేయడం, ఎనిమిది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మూడు నెలల్లో తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీలేదు కేసీఆర్​ను నిందించడం తప్పా. ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం దురదృష్టకరం. తెలంగాణ ఉద్యమ కాలంలో చూసిన చావులు ఇప్పుడు చూస్తూన్నాం."-కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

MLC Kavitha In Kamareddy : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని పొందుర్తి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లనే ఈ ఘటన జరిగిందని అమె చెప్పారు. కేసీఆర్​ను నిందించడం తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదని మండి పడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశామన్న ఆమె, మళ్లీ మూడు నెలల్లో అదే పరిస్థితి చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టమని కవిత విచారం వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని పెద్దన్న ఎలా అవుతారు :​ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Fires On Congress : భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రజా పాలన అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గురుకుల పాఠశాలల్లో వాచ్ మెన్ లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్​ని నియమించాలని జిల్లా కలెక్టర్​ను కోరినట్లు తెలిపారు. మృతుని తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని, ఆధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్ కే ముజీబుద్దిన్, మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం దర్యాప్తు చేయించాలి : ఎమ్మెల్సీ కవిత

'అణగారినవర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్‌ సర్కార్ అన్యాయం చేస్తోంది - ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.