ETV Bharat / state

కవిత అరెస్టుతో నిజామాబాద్‌ బీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం - సమన్వయం చేసే వారు లేకపోవడంతో అయోమయం - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

MLC Kavitha Arrest Impact in BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ మద్యం కేసులో అరెస్టు కావడం నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఇందూరు లోక్‌సభ స్థానంపై పట్టు, గతంలో ఎంపీగా పనిచేసిన ఆమె అనుభవం భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు కలిసి వస్తుందని భావించారు. కానీ కవిత అరెస్టుతో జిల్లాలోని గులాబీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లాయి. ఇప్పటికే చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్తుండగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీని సమన్వయం చేసే పెద్ద దిక్కు లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 10:44 AM IST

కవిత అరెస్టుతో నిజామాబాద్‌ బీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం

MLC Kavitha Arrest Impact in BRS : దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో నిజామాబాద్‌ బీఆర్ఎస్ నిస్తేజంగా మారింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఆమె అరెస్టు పార్టీకి పెద్ద దెబ్బగా పరిణమిస్తోంది. ఇక్కడి నుంచి ఎంపీగా పనిచేసిన కవితను కాదని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు భారత్ రాష్ట్ర సమితి అధిష్ఠానం టికెట్ కేటాయించింది. మద్యం కేసులో అరెస్టు తప్పదనే భయంతోనే కవితను పక్కన పెట్టారన్న చర్చ అప్పట్లో జరిగింది.

Lok Sabha Elections 2024 : అభ్యర్థి ప్రకటన సమయంలో బాజిరెడ్డి గోవర్ధన్‌ గెలుపు బాధ్యత తీసుకుంటానని కవిత చెప్పారు. ఆమెకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు, పార్టీ పరంగా ఉన్న పట్టు కలిసి వస్తాయని అంతా భావించారు. కానీ కవిత అరెస్టుతో (MLC Kavitha Arrest) ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడారు.

పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేది లేదు - శ్రీనివాస్‌ గౌడ్‌

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ చేరికలను ప్రోత్సహిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీజేపీ సైతం చేరికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, బోధన్‌ నియోజకవర్గాల్లో భారత్‌ రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జరిగాయి. పలు మున్సిపల్‌ పీఠాలను, సహకార సంఘాలను సైతం కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది.

BRS on Lok Sabha Polls 2024 : ఇప్పుడు కవిత జైలుకు వెళ్లడంతో ఎన్నికల మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు కవిత లేకుంటే పార్టీ సమన్వయం ఎలా అన్నది బీఆర్ఎస్ నాయకులకు అంతు చిక్కడం లేదు. దీనికి తోడు ఆమె అరెస్టు వల్ల పార్టీ శ్రేణులు అయోమయంలోకి వెళ్లిపోయారు. మరోవైపు కవిత జైలుకు వెళ్లడంతో పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి.

దిల్లీ మద్యం కేసులో కవిత బాధితురాలు మాత్రమే - నిందితురాలు కాదు : సత్యవతి రాఠోడ్

2014లో నిజామాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల కవిత (Kavitha Latest Updates) 2019లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత రెండు సార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్‌, నిజామాబాద్ అర్బన్‌ ఇంఛార్జ్‌గా పనిచేసిన ఆమె పార్లమెంట్‌ పరిధిలోని అభ్యర్థులందరి తరపునా ప్రచారం చేశారు. ఇప్పుడు జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా కవిత సమన్వయం చేస్తుందని అందరూ భావించారు.

కానీ ఇప్పుడు కవిత జైలుకు వెళ్లడంతో ఎవరు సమన్వయం చేస్తారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఆమె అరెస్టు వల్ల బీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందని స్థానిక నాయకత్వం భావిస్తుంది. ఈ పరిణామాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ, కాంగ్రెస్‌ లెక్కలేసుకుంటున్నాయి.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​కు నిరసనగా బీఆర్​ఎస్​ శ్రేణుల ఆందోళన బాట - కేంద్రం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు

ఎన్నికల ప్రచార జోరు పెంచనున్న కారు - కార్యాచరణపై గులాబీ నేతల కసరత్తు - BRS Strategy on MP Elections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.