ETV Bharat / state

'మీ ఇంట్లో ఆత్మ తిరుగుతోంది - పూజలు చేయకపోతే ఫ్యామిలీ మొత్తం చనిపోతారు' - miscreants stole 30 lakhs in Pooja - MISCREANTS STOLE 30 LAKHS IN POOJA

Criminals RS 30 Lakhs Fraud : ఈ టెక్నాలజీ యుగంలోనూ మంత్రాలకు డబ్బు కట్టలు, ఆరోగ్యం వస్తాయని భావించే వారు చాలా మందే ఉన్నారు. ఇలా నమ్మిన ఓ ఫ్యామిలీ ఏకంగా రూ.30 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లో వెలుగుచూసింది.

Criminals RS 30 Lakhs Fraud
Criminals RS 30 Lakhs Fraud (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 8:15 AM IST

Donga Babas Stole Rs 30 Lakhs from Woman : ప్రతిరోజు టీవీ చూస్తున్నప్పుడు గానీ, సోషల్​ మీడియాలో రీల్స్​, యూట్యూబ్​లో వీడియోలు చూస్తున్నప్పుడు గానీ, ఏవైనా వీడియో పెట్టినప్పుడు గానీ 'మీ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయా, మీ పిల్లలకు ఎంత చదివినా ఉద్యోగం రావడం లేదా, వయసు పెరుగుతున్నా పెళ్లి కావడం లేదా, ప్రేమికుడు ప్రేమలో పడడానికి వశీకరణం చేయాలా, మీ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగోలేదా, మీ ఇంట్లో నరఘోష ఉందా అయితే వెంటనే మా జ్యోతిష్యాలయం నంబరును సంప్రదించండి. మీ సమస్యలు అన్నీ సత్వరం పరిష్కరిస్తాం' లాంటి యాడ్​లు దర్శనమిస్తుంటాయి. ఒకవేళ నిజంగా ఇంట్లో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించి ఆత్రుతతో ఆ నంబరుకు కాల్​ చేశామో ఇక అంతే. మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయం!

నిజంగా ఇలాంటివి నమ్మేవారు అన్ని వర్గాల్లోనూ ఉంటున్నారు. ముఖ్యంగా ఈ 'డబ్బు' కాలంలో ఇలాంటి మూఢ నమ్మకాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. తొందరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలా మంది ఇటువంటి మార్గాల వైపు వెళుతున్నారు. ఇలాంటి వారినే టార్గెట్​గా చేసుకొని అలాంటి దొంగబాబాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా, రోడ్డు పక్కల ఈ బిజినెస్​ యమ వేగంగా సాగుతోంది. వీటిని నమ్మిన వారు పూర్తిగా చితికిపోతున్నారు. దొంగ బాబాల వేషంలో వచ్చి అత్యాచారాలకు ఒడిగొన్న ఘటనలూ చూస్తున్నాం. ఇలా మోసపోయామని బయటకు చెప్పుకోలేక ఎందరో లోలోపల కుమిలిపోయిన వారున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.

Criminals RS 30 Lakhs Fraud
రూ.30 లక్షలు దోచుకున్న దొంగబాబాలు (ETV Bharat)

ఇంట్లో ఆత్మ తిరుగుతోందని రూ.30 లక్షలు స్వాహా : ఇంట్లో ఆత్మ తిరుగుతోందని, దోష నివారణ పూజలు చేయకుంటే, ఇంట్లో కుటుంబం మొత్తం చనిపోతారని భయాందోళనలకు గురి చేసి ఓ ఫ్యామిలీ వద్ద దొంగ బాబాలు ఏకంగా రూ.30 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని గాంధీనగర్​ ఠాణా పరిధి న్యూ బోయిగూడలో జరిగింది. ఓ మహిళ తన తల్లికి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదని, సామాజిక మాధ్యమాల్లో వెతకగా, పూజలతో ఆరోగ్య సమస్యలు తీరుతాయనే ప్రకటన చూసింది. వెంటనే వారిని సంప్రదించి పూజలు చేయించింది.

ఆ పూజ బృందంలోని సభ్యులు పురాణం నివాస్​, కిన్నెరసాయి, నాగరాజు, ఎర్నాల వాసు మీ ఇంట్లో ఆత్మ తిరుగుతోందని, పూజలు చేయకపోతే కుటుంబం మొత్తం చనిపోతారని భయాందోళనలకు గురి చేశారు. వారి మాటలు నమ్మిన ఆమె, ఆగస్టు 17 నుంచి రూ.30 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఆమె తల్లి ఆరోగ్యం కుదుటపడక క్షీణించడంతో మోసపోయాయని గ్రహించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.20 లక్షలు వసూలు చేశారు.

మంత్రాల నెపంతో తల్లీ, కుమారుడి దారుణ హత్య - రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపిన మూఢనమ్మకం

Student Suicide in Kulsumpura : ఇంటర్​ విద్యార్థిని సూసైడ్​.. క్షుద్రపూజలే కారణమంటూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.