ETV Bharat / state

మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి : మంత్రి శ్రీధర్‌ బాబు - Microsoft Centers Expansion in TG - MICROSOFT CENTERS EXPANSION IN TG

Minister Sridhar Babu on Microsoft Centers : 2025 నాటికి మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ విస్తరణ పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు సంస్థ ప్రతినిధులను కోరారు. డేటా సెంటర్లకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం, మౌలిక వసతులపై సచివాలయంలో సంస్థ ప్రతినిధులతో కలిసి ఇవాళ మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Minister Sridhar Babu Review on MS Data Centers
Minister Sridhar Babu on Microsoft Centers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 7:30 PM IST

Minister Sridhar Babu Review on MS Data Centers : మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి కార్యకలాపాలను పెంచాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంస్థ ప్రతినిధులను కోరారు. విస్తరణ పూర్తయితే అత్యాధునిక డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటుందని మంత్రి వెల్లడించారు.

డేటా సెంటర్లకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం, మౌలిక వసతులపై సచివాలయంలో మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. మైక్రోసాఫ్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్ ఇయాన్ కాలన్, భూ అభివృద్ధి విభాగం హెడ్ ఉత్తమ్ గుప్తా, ఇండియా కమ్యూనిటీ హెడ్ శ్రీచందన మంత్రికి డాటా విస్తరణపై సానుకూలతలు సహా ప్రతికూలతలను కూలంకషంగా వెల్లడించారు.

Microsoft Representatives on Land Acquisition Issues : డేటా సెంటర్ కోసం మేకగూడలో సేకరించిన 22 ఎకరాలకు సంబంధించి స్థానిక పంచాయతీతో కొన్ని సమస్యలున్నట్టు మైక్రోసాఫ్ట్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే పరిష్కారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంకను ఆదేశించారు. విద్యుత్తు సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు, వరద నీటి కాలువల నిర్మాణం లాంటి పనులు గడువులోగా పూర్తి చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.

మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి : సంస్థ సేకరించిన భూముల వినియోగ మార్పిడి పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ రంగారెడ్డి జిల్లా మేకగూడలో 22 ఎకరాలు, షాద్ నగర్​లో 41 ఎకరాలు, చందన్ వల్లెలో 52 ఎకరాలు కొనుగోలు చేసింది. డేటా సెంటర్ల పనులు 70 శాతం పూర్తయ్యాయని సంస్థ ప్రతినిధులు శ్రీధర్ బాబుకు వివరించారు.

ప్రభుత్వం తరఫు నుంచి పెండింగ్ పనుల పర్యవేక్షణ కోసం ఒక అధికారిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని సూచించారు. కాగా ఇందుకు సంబంధించిన సమీక్షలో సంస్థ ప్రతినిధులు సహా తదితర అధికారురు పాల్గొన్నారు.

'ప్రభుత్వంపై మరక అంటిస్తే వెంటనే తుడిచేస్తాం - రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డొస్తే ఎవరినీ సహించం' - Minister Sridhar Babu press meet

ఏఐ సిటీ కోసం హైదరాబాద్​లో 200 ఎకరాల కేటాయింపు : మంత్రి శ్రీధర్ బాబు - Minister Sridhar launch Tech Hub

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.