ETV Bharat / state

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పదేళ్లుగా కోరుతున్నాం: సీతక్క - Medaram Jatara 2024

Minister Seethakka Review on Medaram Jatara : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పదేళ్లుగా కోరుతున్నా, కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం బాధాకరమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. మరికొద్ది గంటల్లో ప్రారంభమవ్వనున్న మేడారం మహాజాతరకు, కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని సూచించారు. మేడారం జాతర, ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

Sammakka Sarakka Jatara 2024
Minister Seethakka Review on Medaram Jatara
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 9:07 PM IST

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పదేళ్లుగా కోరుతున్నాం: సీతక్క

Minister Seethakka Review on Medaram Jatara : తెలంగాణ కుంభమేళా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పదేళ్లుగా కోరుతున్నా, కేంద్రం(Central Govt) నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం బాధాకరమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహాఘట్టం కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న జాతరకు సంబంధించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాను దగ్గరుండి పరివేక్షిస్తున్నట్లు వివరించారు.

వన జాతరకు ఎలాంటి సంకోచం లేకుండా ప్రజలు తరలిరావాలి : సీతక్క

ఈ క్రమంలోనే ప్రజలకు పలు సూచనలు చేశారు. కుటుంబసమేతంగా వచ్చే భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు సీతక్క వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మేడారం జాతర, ఆలయ అభివృద్ధికి(Temple Development) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.110 కోట్లు కేటాయించారని మంత్రి సీతక్క తెలిపారు.

Sammakka Sarakka Jatara 2024 : ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారన్న మంత్రి, వన దేవతలను దర్శించుకోవటంలో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వనంలో ఉన్న దేవతలు ఇప్పటికే జనం మధ్యకు పయనమయ్యారని తెలిపారు. ఇప్పటికే దూరప్రాంతాలనుంచి వ్యయప్రయాసలు లెక్కచేయక జనం మేడారానికి(Medaram) తరలివస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.

"మేడారం మహాజాతర ఘట్టం మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. ఈనెల 24వ తేదీ సాయంత్రం వరకు నలుగురు దేవుళ్లు జనంలో ఉంటారు. శనివారం సాయంత్రం మళ్లీ వన ప్రవేశం చేయటం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కుటుంబ సమేతంగా క్రమశిక్షణతో తరలి రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని పదేళ్లుగా కోరుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటేమీ రాకపోవడం బాధాకరం."-సీతక్క, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి

Medaram Fair Arrangements : జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారని, ఈ నాలుగు రోజుల్లో కోటిన్నర మందికి పైగా భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు(Officials) అంచా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలు జరిగే 4 రోజులపాటు పకడ్బందీ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారని వివరించారు. రేపటి రోజు తరలివచ్చే లక్షలాది భక్తుల దృష్ట్యా బంగారం అందరికీ చేరేలా చేయటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

మేడారానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రజలకు, వీఐపీలకు పోలీసులు పూర్తిగా సహకరించేలా, సామరస్యంగా నడుచుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. మహాజాతరకు ప్రతి ఒక్కరి కృషి ఉంటే మరింత ఘనంగా పండుగ జరుపుకోవచ్చని తెలిపారు. భక్తులకు సౌకర్యార్ధం పారిశుధ్యానికి ప్రత్యేక కార్యాచరణ, తాగునీటి లభ్యత, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. రోడ్లు విస్తీర్ణం చేసి, పార్కింగ్​కు స్థలం కేటాయించామన్నారు.

గొర్రెలు, మేకలతో ఆర్టీసీ బస్సులో పోనీయరా?, భూపాలపల్లి బస్టాండులో ప్రయాణికుల ఆందోళన

మేడారం బయల్దేరిన పగిడిద్దరాజు - రేపటి నుంచే మహాజాతర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.