Minister Ponnam Appreciates Lady Conductor : టీజీఎస్ఆర్టీసీ బస్సులో గర్భిణీకి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న వనపర్తి డిపో మహిళా కండక్టర్ జి. భారతికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థంగా విధులు నిర్వర్తిస్తూనే సేవాతత్వం చాటుతుండటం అభినందనీయం అని మంత్రి పొన్నం కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
#TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న వనపర్తి డిపోనకు చెందిన మహిళా కండక్టర్ జి.భారతికి నా అభినందనలు.
— Ponnam Prabhakar (@Ponnam_INC) August 19, 2024
సమయస్పూర్తితో వ్యవహారించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థవంతంగా… pic.twitter.com/nfmrtliPte
అసలేం జరిగింది? : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో బస్సులో ఉన్న మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి మహిళకు పురుడుపోసింది. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గద్వాల-వనపర్తి రూట్ పల్లెవెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణీ రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తి బయలుదేరింది.
బస్సు వనపర్తి జిల్లా నాచహల్లి సమీపంలోకి రాగానే గర్భిణీకి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఒక నర్సు సాయంతో గర్భిణీకి పురుడు పోశారు. ఆ మహిళ పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 108 అంబులెన్స్ సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి… pic.twitter.com/nTpfVpl5iT
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) August 19, 2024
RTC MD Sajjanar Appreciates Lady Conductor : మరోవైపు ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం స్పందించారు. "రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తున్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు." అని ట్వీట్ చేశారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయమని కొనియాడారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి మహిళతోపాటు బిడ్డ ప్రాణాలు కాపాడిన కండక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.
అందరితో స్నేహం వృత్తిలోనే సంతోషం - ఈ కండక్టర్ వెరీ ఫ్రెండ్లీ బ్రో - HYDERABAD LADY CONDUCTOR STORY