ETV Bharat / state

త్వరలోనే మెగా డీఎస్సీ - జాబ్​ క్యాలెండర్​ ప్రక్రియ ప్రారంభించాం : భట్టి విక్రమార్క - తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్

Mega DSC Announcement in Telangana :రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తొలి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. తన బడ్జెట్ ప్రసంగంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీ కోసం జాబ్​ క్యాలెండర్​ తయారు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.

Deputy CM Bhatti Vikramarka Announce Job Calender
Mega DSC Announcement in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 2:57 PM IST

Updated : Feb 10, 2024, 4:16 PM IST

త్వరలోనే మెగా డీఎస్సీ - జాబ్​ క్యాలెండర్​ ప్రక్రియ ప్రారంభించాం : భట్టి విక్రమార్క

Mega DSC Announcement in Telangana : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తొలి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇవాళ శాసనసభలో రూ.2.75 లక్షల కోట్లతో ఓటాన్​ బడ్జెట్​ ప్రవేశపెట్టిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల(Job Placements) విషయంలో జాబ్​ క్యాలెండర్​ తయారు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.

గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్​ కాదు - వాస్తవిక బడ్జెట్ : సీఎం రేవంత్​

Job Notifications in Telangana : దాదాపు 15 వేల మంది కానిస్టేబుళ్ల రిక్రూట్​మెంట్​ అతి త్వరలో పూర్తి చేసి, నియామకపత్రాలు ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే నోటిఫికేషన్​లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్​-1 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్​ పాలనలో(BRS Governance) ఒక్క గ్రూప్​ వన్​ ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవతాలతో చెలగాటం ఆడిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

Deputy CM Bhatti Vikramarka on TSPSC : గత ప్రభుత్వ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ యువత ఆకాంక్షలను తీర్చేలా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉపముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్​ సరైన దారిలో పెట్టటమే కాకుండా నిరుద్యోగ యువత(Unemployed Youth) ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పనిచేయడానికి ప్రక్షాళన చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం నిర్వహణ ఖర్చు నిమిత్తం అవసరమైన రూ.40 కోట్ల ఆర్థిక వనరులను, అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేసినట్లు తెలిపారు.

"యువకులను రెచ్చగొట్టడం కాదు, అక్కున చేర్చుకుంటాం. వారికి ఆసరాగా ఉంటాం, ఆదుకుంటాం. స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే ఏర్పాటు చేస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనులతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతింది. వారి భవిష్యత్​కు మేము గ్యారంటీ ఇచ్చాం. అందులో భాగంగానే ఉద్యోగ నియామక విషయంలో జాబ్​ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియను ప్రారంభించాం. మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నాం. 15 వేల కానిస్టేబుల్ రిక్రూట్​మెంట్​ అతి త్వరలో నిర్వహించి, నియామక పత్రాలను ఇవ్వబోతున్నాం."-భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

ఆరు గ్యారంటీలకే బడ్జెట్​లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?

Bhatti Fire on BRS Govt : గత ప్రభుత్వం చేసిన పనులతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్షేపించారు. వారి భవిష్యత్​కు తాము గ్యారెంటీ ఇచ్చినందుకే, రాష్ట్రంలోని యువత తమ వెంట నిలిచిందన్నారు. ఈ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరింత బాధ్యతగా తమ ప్రభుత్వం(Congress Govt) ముందుకు వెళ్తుందని భట్టి పేర్కొన్నారు. యువజన సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యంగా చెప్పుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి, స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతే దేశానికి భవిష్యత్తు అంటూ కూనిరాగాలు తీయటం కాదని, చిత్తశుద్ధితో వారి మెరుగైన జీవతానికి బాటలు వేస్తామని హామీ ఇచ్చారు.

'కొంతమందికి భరణంగా, చాలా మందికి ఆభరణంగా భారంగా మారిన ధరణి'

త్వరలోనే కర్షకులకు రుణమాఫీ - కౌలుదారులకు రైతుబంధు

Last Updated : Feb 10, 2024, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.