ETV Bharat / state

ప్రేమకత్తికి మరో ప్రాణం బలి - ఉన్మాది దాడిలో యువతి మృతి - అనంతరం యువకుడి ఆత్మహత్యాయత్నం - HYDERABAD MAN KILLS EX GIRLFRIEND - HYDERABAD MAN KILLS EX GIRLFRIEND

YOung Man Kills Young Woman For Marriage in Hyderabad : ప్రేమ కత్తికి మరో ప్రాణం బలైపోయింది. ప్రేమోన్మాది చేతిలో మరో యువతి ప్రాణం కోల్పోయింది. ప్రేమించిన వాడి నిజస్వరూపం తెలిసి బ్రేకప్ చెప్పిన ఆ యువతిని అనుక్షణం వెంటాడసాగాడు ఆ ఉన్మాది. పెళ్లి చేసుకోమంటూ నిత్యం వేధించినా తట్టుకుని ధైర్యంగా నిలబడింది. కానీ చివరకు ప్రేమోన్మాది కత్తిపోటుకు బలైపోయింది. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధి గోపన్​పల్లిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

A Lover Attack on Young Woman With Knife
A Lover Attack on Young Woman With Knife (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 8:45 AM IST

Updated : Aug 29, 2024, 9:44 AM IST

A Lover Attack on Young Woman With Knife : సమాజంలో రోజురోజుకూ ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రేమించమని వెంటపడుతూ బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తారు కొందరు. ప్రేమ అంగీకరించకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు మరికొందరు. అమ్మాయి దక్కలేదనే కక్షతో పలుమార్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆ ఉన్మాదంలో ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.

తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్​లోని గచ్చిబౌలి పరిధి గోపన్​పల్లి తండాలో చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని వెంటాడిన యువకుడిని ఆ యువతి నిరాకరించింది. ఆ కోపంతో సదరు యువతిపై ఆమె మాజీ ప్రియుడు కత్తితో దాడి చేసి హతమార్చాడు. అడ్డుకునేందుకు వచ్చిన వారిపైనా దాడికి తెగబడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : కర్ణాటక బీదర్​కు చెందిన రాకేశ్​ అనే వ్యక్తి మాదాపూర్​లోని ఓ ప్రైవేటు హాస్టల్​లో నివాసం ఉంటున్నాడు. అతడికి నల్లగండ్లలో బ్యూటీషియన్​గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్​కు చెందిన దీపన తమాంగ్​ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీపన తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలి గోపన్​పల్లి తండాలో నివాసం ఉంటుంది. వారిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు ఏర్పడి రాకేశ్​​కు దీపన బ్రేకప్​ చెప్పింది. అయినా రాకేశ్ ఆమె వెంట పడుతూ వేధించసాగాడు.

పెళ్లి చేసుకోవాలని తరచూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేశ్ తనను పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి ఆమెను వేధించసాగాడు. యువతి ససేమిరా నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రాకేశ్ కూరగాయలు కోసుకునే కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అతడిని అడ్డుకోవడానికి బాధితురాలి స్నేహితులు ప్రయత్నించగా వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దీపన అక్కడికక్కడే మరణించగా, దాడిని అడ్డుకున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

యువతిపై దాడి అనంతరం రాకేశ్‌ కనకమామిడి వద్ద విద్యుత్‌ స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో గాయపడిన రాకేశ్‌కు కనకమామిడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Aug 29, 2024, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.