Mahabubnagar Police Recovered lost Mobile Phones : మన జీవనంలో మొబైల్ ఫోన్ విడదీయరాని భాగమైపోయింది. ఫోన్ లేకపోతే రోజు గడవదన్న స్థాయికి చేరుకున్నాం. వ్యక్తిగతమైన సమాచారం ఉండే ఫోన్ పోయి అసాంఘిక శక్తులు, సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో పడితే ఇబ్బందులే కాకుండా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కేసులు విచారణలు సైతం కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా పోయిన మొబైల్ ఫోన్లను పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో రికవరీ చేస్తూ బాధితులకు అందించటంతో వారికి ఎంతో ఊరటగా మారింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల రికవరీలో జడ్చర్ల పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే 6వ స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ఫోన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు ఆసక్తికర విషయాలతో ఈటీవీ భారత్ ప్రత్యేత కథనం.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా నిత్యం ఎంతోమంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. మరికొందరి ఫోన్లు మార్కెట్లో చోరీకి గురవుతున్నాయి. వారు పోగొట్టుకుంటున్న ఫోన్లు సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల విలువే కాదు, ఎంతో కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని సైతం కోల్పోతున్నారు. బంధువులు, అత్మీయులు, తెలిసిన వారి ఫోన్ నంబర్లు, కుటుంబానికి చెందిన ఫొటోలు, బ్యాంకు లావాదేవీలు చేసే యాప్స్, కీలకమైన పత్రాలు ఇలా ఎన్నో ముఖ్యమైన వివరాలు అందులోని భద్రపరుస్తున్నాం. అందుకే ఫోన్ పోయిన వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా 112 మొబైల్ ఫోన్లను జిల్లా IT cell సిబ్బంది సహకారంతో చేసి ఈ రోజు జిల్లా పోలీస్ కవాతు మైదానము నందు వాటిని సంబంధిత యజమానులకు తిరిగి అప్పగించడం జరిగింది.
— Mahbubnagar District Police (@MBNRpolice) November 6, 2024
Read More...https://t.co/5v7VQsveec pic.twitter.com/BLGqvf5lRD
అప్రమత్తత అవసరం : ఈ క్రమంలో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందిస్తుంటే వారు నమ్మలేకపోతున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే మొబైల్ ఫోన్లు ఎక్కువగా పోతున్నాయి. నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన కొందురు ఫోన్ల చోరీలో అరితేరారు. వారు నెలలో ఒక రెండు సార్లు వచ్చి పట్టణాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో చోరీలు చేస్తారు. ఇలా మహబూబ్‌నగర్‌లోని మార్కెట్లో, గడియారం కూడలి, పాన్ చౌరస్తా ప్రాంతాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్లో, బస్సులు, రైళ్లల్లో చోరీలు ఎక్కువగానే జరుగుతున్నాయి. చోక్కా జేబులో పెట్టుకుంటున్న ఫోన్లే ఎక్కువగా చోరీకి గురువుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు ఇతరులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
మహబూబూబ్‌నగర్ జిల్లాలోనే అత్యధికం : ఉమ్మడి పాలమూరులో ఎక్కువ చరవాణుల రికవరీ చేసిన జిల్లాగా మహబూబ్‌నగర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లా ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గతేడాది నుంచి దాదాపు 4,412 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.4.41కోట్లు ఉంటుందని అంచనా. రాష్ట్రంలో ఎక్కువగా ఫోన్లను రికవరీ చేసిన 10 పోలీసు స్టేషన్లు గుర్తించగా జడ్చర్ల ఠాణా ఆరో స్థానంలో ఉంది.
మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్లో 216, బాలానగర్ ఠాణాలో 114 చొప్పున ఫోన్లను రికవరీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ ఠాణాలో 263, గద్వాల ఠాణాలో 170 చొప్పున ఫోన్లను రికవరీ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ స్టేషన్లో ఎక్కువగా 262, అచ్చంపేట ఠాణాలో 131, కల్వకుర్తి ఠాణాలో 106 ఫోన్లను రికవరీ చేశారు. వనపర్తి జిల్లాలో పెబ్బేరు ఠాణాలో 180, పాన్‌గల్ స్టేషన్లో 135, నారాయణపేట జిల్లాలో ఎక్కువగా కోస్గి స్టేషన్లో 101, నారాయణపేట ఠాణాలో 79, మక్తల్ స్టేషన్లో 67 చోప్పున మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.
సీఈఐఆర్ పోర్టల్‌లో దరఖాస్తు చేయండిలా : ఎవరైనా తమ ఫోన్ కోల్పోతే వెంటనే www.ceir.gov.in అనే కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడింటిటీ రిజిస్టర్ పోర్టల్‌లో వెళ్లి వివరాలు, ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేయాలి. అనంతరం ఆ వివరాలను ప్రింట్ తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి.
చోరీకి గురైన 90 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన ఎల్బీనగర్ పోలీసులు - LB NAGAR POLICE RECOVERED 90 PHONES
మీ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ - ఇకపై మీరే దాన్ని బ్లాక్ చేయవచ్చు! - How To Block Stolen Phone