Liquor Shops Close in Hyderabad : మద్యం ప్రియులకు వారం రోజుల వ్యవధిలోనే రెండో షాక్ తగలనుంది. ఈ నెల 23న హైదరాబాద్‌లోని వైన్ షాపులు, బార్లు మూసేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
24 గంటల పాటు..
నగర పరిధిలోని అన్ని వైన్ షాపులూ, కల్లు దుకాణాలూ 24 గంటల పాటు మూసి ఉంచాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో ఉన్న వాటిని మినహాయించి.. ఇతర షాపులన్నీ క్లోజ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెస్టరెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, ఇంకా బార్లన్నీ మూసేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 23 ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 24 ఉదయం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఆదేశాలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హనుమంతుడు సింధూరం రంగులోనే ఉంటాడెందుకు? - ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?
హనుమాన్ జయంతి సందర్భంగా..
రేపు అంటే.. ఏప్రిల్ 23 మంగళవారం రోజున హనుమాన్ జయంతి ఉంది. ఈ నేపథ్యంలోనే మద్యం దుకాణాలు మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. వారం రోజుల క్రితం కూడా మద్యం దుకాణాలు మూసేశారు. శ్రీరామ నవమి నేపథ్యంలో ఏప్రిల్ 17న హైదరాబాద్ జంటనగరాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. 17న ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ మార్నింగ్ 6 వరకు మద్యం షాపులు మూసి ఉంచారు. మళ్లీ ఇప్పుడు బంద్ చేయనుండడంతో మద్యం ప్రియులకు వారంలోనే రెండు సార్లు షాక్ తగిలినట్టైంది. గత ఆదివారం మాంసం దుకాణాలు కూడా మూసేసిన సంగతి తెలిసిందే. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి నేపథ్యంలో చికెన్, మటన్ దుకాణాలు మూసేస్తూ జీహెచ్ఎంసీ ఉత్తర్వులు ఇచ్చింది.
వైన్ షాపుల్లో సేదతీరుతున్న మందు బాబులు..
తెలంగాణలో ఎండలు దంచి కొడుతుండడంతో మందు బాబులు వైన్ షాపుల్లో సేద తీరుతున్నారు. చిల్డ్ బీర్ లాగిస్తూ రిలాక్స్ అవుతున్నారు. దీంతో బీర్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఫలితంగా బీర్లు అందుబాటులో ఉండట్లేదని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరత ఏర్పడడంతో రేషన్ ఆధారంగా దుకాణాలకు బీర్లు సప్లై చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటిది
శ్రీరామనవమి రోజున ఇంటిపై హనుమాన్ జెండా - ఎందుకు ఎగరేస్తారో తెలుసా? - Sri Rama Navami 2024