ETV Bharat / state

వామ్మో! తిరుమలలో మళ్లీ చిరుత - భయంతో పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది - Leopard Wanders At Tirumala - LEOPARD WANDERS AT TIRUMALA

Leopard Wanders At Tirumala : తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచరించినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. చిరుతను చూసి భయంతో పరుగు తీసినట్లు చెప్పారు. తాజాగా సీసీ కెమెరాలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు నమోదు అయ్యాయి.

Leopard Wanders At Tirumala
Leopard Wanders At Tirumala (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2024, 10:03 AM IST

Updated : Sep 29, 2024, 11:10 AM IST

Leopard Wandering At Tirumala : తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీవారిమెట్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తూ రాత్రి కంట్రోల్ రూం వద్దకు రావడంతో శునకాలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్​లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తన టీటీడీ సెక్యూరిటీ గార్డు అటవీ అధికారులకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో భక్తుల కారుకు చిరుత అడ్డపడింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై అటవీ అధికారులు స్పందించారు.

స్పందించిన అటవీ అధికారులు : ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. 2 రోజులుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల సమయంలో చిరుత శ్రీవారి మెట్టు ప్రాంతంలో సంచరించినట్లు అటవీ అధికారులు వివరించారు. దాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా బయపడి కంట్రోల్​ రూమ్​లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారని తెలిపారు. వెంటనే అటవీశాఖ అధికారులకు టీటీడీ సెక్యూరిటీ గార్డు సమాచారం ఇచ్చినట్లుగా వెల్లడించారు.

చిరుత రాత్రిపూట మాత్రమే సంచరిస్తుంది : తిరుమల శ్రీవారి మెట్టువద్ద సంచరిస్తున్న చిరుతను చూసి శునకాలు వెంబడించాయని అటవీ అధికారులు తెలిపారు. కానీ చిరుత కుక్కలపై దాడి చేసేందుకు వెంబడించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని పేర్కొన్నారు. చిరుత రాత్రిపూట సంచరిస్తున్నందున దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. శ్రీవారి మెట్టునుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ఉదయం 6 గంటల నుంచి 6 వరకు మాత్రమే అనుమతిస్తామని వివరించారు. చిరుత సంచారంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు పంపిస్తున్నారు.

Leopard Trapped in Cage Tirumala : తిరుమలలో ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత

తిరుమలలో చిరుత కలకలం - సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు - Cheetah Spotted At Tirumala

Last Updated : Sep 29, 2024, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.