ETV Bharat / state

బాలామృతంతో బోలెడు ప్రయోజనాలు - మరి మీ పిల్లలకు తినిపిస్తున్నారా? - BALAMRUTHAM IN ANGANWADI

ఎదిగే పిల్లలకు సరైన ఆహారం అందించడం ముఖ్యం - అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా బాలామృతం పంపిణీ - బరువు తక్కువున్న పిల్లలకు బాలామృతం ప్లస్‌

NUTRITION FOOD IN ANGANWADI
Balamrutham Nutrition Food for Children (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 4:53 PM IST

Updated : Oct 27, 2024, 6:46 PM IST

Balamrutham Nutrition Food for Children : నేటి బాలలే - రేపటి పౌరులు. పిల్లలను ఇప్పటి నుంచే ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. పెరుగుతున్న సమయంలో వారికి సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం చాలా ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇదే ఉద్దేశంతో చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తోంది. ఇందుకు కోసం ప్రత్యేకంగా బాలామృతం పంపిణీ చేస్తోంది. అవగాహన లోపంతో కొందరు సరైన మోతాదులో పిల్లలకు అందించకపోవడం, మరికొంతమంది దీన్ని వినియోగించుకోవడం లేదు.

ఉమ్మడి వికారాబాద్‌, మెదక్‌ జిల్లాలోని అంగన్​వాడీలో నమోదైన చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులకు ప్రత్యేకంగా పోషక విలువలు ఉండే బాలామృతం ఇస్తున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్​ అందిస్తూ సాధారణ బరువుకు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

'చిన్నారులకు బాలామృతం తినిపిస్తే వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఇప్పటికే చాలా మందికి అవగాహన కల్పిస్తున్నాం. మూడేళ్లలోపు పిల్లలకు అయితే తప్పనిసరిగా బాలామృతం తినిపించాలని తల్లులకు సూచిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బాలామృతాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నాం. బరువు తుక్కువ ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్‌ను అందిస్తున్నాం'- లలిత కుమారి, సంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారిణి

బాలామృతంలో ఉండే పోషకాలు ఇవే : సుమారు నాలుగు జిల్లాల్లో అవగాహన లోపంతో బాలామృతాన్ని సరైన పద్ధతిలో చాలా మంది వినియోగించుకోవడం లేదు. 100 గ్రా. బాలామృతంలో 414 కిలో కేలరీల శక్తి, 11 గ్రా. ప్రోటీన్లు ఉండగా 167 మి.గ్రా. కాల్షియం, 3.1 మి.గ్రా. ఐరన్‌, 2.5 మి.గ్రా. విటమిన్‌ ఏ, 0.3 విటమిన్‌ బి1, 0.2 మి.గ్రా. విటమిన్‌ బి2, 0.5 మి.గ్రా విటమిన్‌ సీ, 7.1 మి.గ్రా పోలిక్‌ యాసిడ్‌ ఉంటాయి. వీటితో పిల్లలకు సరైన ఆహారం అంది, వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఈ విషయంపై ఇప్పటికైనా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. బాలామృతం తింటున్న పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. ఒక ప్యాకెట్‌లో 2.50 కి.గ్రా బాలామృతం ఉంటుంది. నెలకు ఒకటి చొప్పున చిన్నారులకు ఇస్తారు. ఏడు నెలల నుంచి ఏడాది వయసు ఉన్న పిల్లలకు రోజుకు 100 గ్రా. మూడు సార్లు పాలల్లో లేదా గోరువెచ్చని నీటిలో తినిపించాలి. ఒక సంవత్సరం వయసు ఉన్న వారికి మోతాదు పెంచాలి.

నిరుద్యోగులకు గుడ్​న్యూస్ - త్వరలో అంగన్​వాడీలో 11వేల పోస్టుల భర్తీ - TELANGANA ANGANWADI JOBS 2024

'అంగన్వాడీలకు నాణ్యమైన సరకులు సరఫరా చేయండి - లేదంటే తప్పుకోండి'

Last Updated : Oct 27, 2024, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.