KTR Questioned ED on X : కర్ణాటక వాల్మీకి కుంభకోణంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపంచారు. ఈ కుంభకోణంలో తెలంగాణ కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తెలంగాణలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు రహస్య లింక్‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు.
The outrageous Valmiki Scam in Karnataka and its intriguing link to Telangana politicians & business men
— KTR (@KTRBRS) August 24, 2024
✳️ Who are the 9 bank account holders in Hyderabad to whom the ST Corporation money of Rs. 45 Cr was transferred?
✳️ Who is the owner of “V6 Business” to which Rs. 4.5 Cr… pic.twitter.com/qQxlZdaTSu
కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్‌కు చెందిన 45 కోట్ల రూపాయలు బదిలీ అయిన హైదరాబాద్‌లోని తొమ్మిది మంది బ్యాంకు ఖాతాదారులు ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. నాలుగున్నర కోట్లు బదిలీ అయిన ఓ ఛానల్ యాజమాని ఎవరు అని ప్రశ్నించారు. సిట్, సీఐడీ, ఈడీ సంస్థలు ఇక్కడ దాడులు నిర్వహించారని, ఆ వార్తలు మీడియాలో రాకుండా ఎందుకు అణిచివేశారని కేటీఆర్ నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో నగదు విత్‌డ్రా చేసిన బార్‌లు, బంగారు దుకాణాలను ఎవరు నడుపుతున్నారని, కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
వాల్మీకి కుంభకోణంలో రూ.90 కోట్ల అవినీతి జరిగిందని కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి ఎందుకు అన్నారని, దాని అర్థం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. విషయాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ, తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉందని, ఇక్కడ కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారో సమాధానాలు చెప్పగలరా అని ఈడీ డైరెక్టర్‌ను కేటీఆర్ అడిగారు.
హరీశ్‌రావు ఫైర్ : రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. 2007లో ఈ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే పథకం కావడంతో కేసీఆర్ కొనసాగించారని హరీశ్‌రావు తెలిపారు.
ప్రారంభంలో 8 వేల విద్యార్థులతో 80 ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే ఉండేవని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దీనిని 25 వేల విద్యార్థులకు లబ్ధి చేకూరేలా 150 స్కూళ్లకు విస్తరించినట్లు ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి "చలో దిల్లీ కాదు చలో పల్లె" చేపట్టాలి : కేటీఆర్ ట్వీట్ - KTR SLAMS CM REVANTH REDDY