ETV Bharat / state

కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి - సీఎం హరీష్‌రావా? రేవంత్‌ రెడ్డా? : కేసీఆర్ - KCR SPEECH ON TG FORMATION DAY 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 12:18 PM IST

Updated : Jun 2, 2024, 2:27 PM IST

KCR Speech At TG Formation Day Celebrations : భారత్ రాష్ట్ర సమితి అంటే మహావృక్షమని కేసీఆర్ పేర్కొన్నారు. మళ్లీ గెలిచేది తమ పార్టీయేనని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. అనవసరంగా బీఆర్ఎస్‌ను ఓడగొట్టుకున్నామని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

KCR Speech on Telangana Formation Day 2024
KCR Speech on Telangana Formation Day 2024 (ETV Bharat)

KCR Speech on Telangana Decade Celebrations 2024 : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈరోజు గొప్ప ఉద్విగ్నమైన క్షణమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అంశం హాస్యాస్పదంగా ఉండేదని, గతంలో చాలామంది ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. గతంలో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని స్పీకర్‌ అసెంబ్లీలో అన్నారని ఆయన గుర్తు చేశారు.

'ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆజన్మ తెలంగాణవాది. ఈ సమయంలో జయశంకర్‌ను స్మరించుకోకుండా ఉండలేం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వంటి మనుషులు అరుదుగా ఉంటారు. తెలంగాణ భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందరు హేళన చేశారు. అలాగే ముల్కీ నిబంధనల అంశం చాలా ఏళ్లు న్యాయపోరాటంగా మారింది. ముల్కీ నిబంధనలు సమంజసమే అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం వచ్చింది' అని కేసీఆర్ గుర్తు చేశారు.

బతుకమ్మ సినిమా తీద్దామని కథ కూడా రాశాను : జై ఆంధ్రా ఉద్యమంలో 70 మందికిపైగా కాల్పుల్లో చనిపోయారని కేసీఆర్‌ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేసిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర చాలా గొప్పదని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ సంఘం కొనసాగిందని చెప్పారు. ఎప్పటికైనా ఓ నాయకుడు రాకపోతాడా అని జయశంకర్‌ భావించారని పేర్కొన్నారు. బతుకమ్మ సినిమా తీద్దామని కథ కూడా రాశానని కేసీఆర్ వెల్లడించారు.

"ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాళ్లను సీఎం కానీయలేదు. ఉమ్మడి ఏపీలో ముగ్గురు తెలంగాణవాళ్లే సీఎంలు అయ్యారు. తెలంగాణవాడు సీఎం కాగానే ఏదో ఒక గొడవ పెట్టి దించేసేవారు. వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు, 1999లోనే ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఉద్యమం ప్రారంభించగానే పదవులు, పైసలు కోసం మెుదలుపెట్టారనే ప్రచారం చేసేవారు. ఉద్యమం కోసం ఎవరైనా పైసలు అడిగితే నాకు ఫోన్‌ చేయాలని చెప్పా. ఆఫీసుకు జాగా ఇచ్చారని కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసం కూలగొట్టారు. ఆఫీసు కోసం తెలంగాణలోనే తెలంగాణ వ్యక్తికి జాగా దొరకని పరిస్థితి." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత

కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి (ETV Bharat)

KCR Fires on Congress : బీఆర్ఎస్‌ అంటే మహావృక్షమని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం, కొంత నైరాశ్యంలో ఉన్నట్లు చెప్పారు. బస్సుయాత్ర మొదలుపెట్టగానే మళ్లీ అదే గర్జనని తెలిపారు. మళ్లీ గెలిచేది బీఆర్‌ఎస్‌నే అని పేర్కొన్నారు. ఓట్ల కోసం రైతుబంధు ఇవ్వలేదని, చేప పిల్లలు, గొర్రె పిల్లలను పంపిణీ చేస్తే అపహాస్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.

'కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. రాజకీయం నిరంతర ప్రవాహం, అధికారంలో ఉంటేనే రాజకీయం కాదు. ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం. లైన్‌మెన్‌లను హరీష్‌రావు పనిచేయనివ్వట్లేదని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. అసలు ముఖ్యమంత్రి హరీష్‌రావా? రేవంత్‌రెడ్డా?. ప్రస్తుత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. దళితబంధు పథకం అతీగతీ లేదు. అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టాం. అనవసరంగా బీఆర్ఎస్‌ను ఒడగొట్టుకున్నాం అనే ముచ్చట్లు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం గులాబీ పార్టీనే' అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

గెలుపు, ఓటమి ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో పని చేస్తూనే ఉండాలి (ETV Bharat)

KCR on Exit Polls 2024 : ఎగ్జిట్‌పోల్స్‌ ఓ గ్యాంబ్లింగ్‌లా తయారైనట్లు కేసీఆర్ విమర్శించారు. ఒక్కోటి ఒక్కోలా లెక్కలు చెబుతున్నారన్నారు. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి పోతుంటాయి, గెలుపు, ఓటమి ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో పని చేస్తూనే ఉండాలని పేర్కొన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌లో బీఆర్ఎస్‌కు 11 వస్తాయని ఒకరూ, ఒక సీటు వస్తాయిని ఒకరు చెప్పారని తెలిపారు. 11 సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదని 3 సీట్లు వచ్చినా కుంగిపోయేదిలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. కానీ 100కు పైగా ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్‌ గెలిచిందని తెలిపారు. ఇక నూతన ఉద్యమ పంథాను ఆవిష్కరించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. రాజకీయ జయాపజయాలు తమకు లెక్కకాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సమీప భవిష్యత్‌లో పాలన బీఆర్ఎస్ భుజాలపైనే పడుతుంది (ETV Bharat)

"అనుకోకుండా గెలిచిన గెలుపును ఎలా మలుచుకోవాలో కాంగ్రెస్‌కు తెలియట్లేదు. ప్రజలకు ఆవేశం వస్తే ఎవరు ఆపినా ఆగరు. సమీప భవిష్యత్‌లో పాలన బీఆర్ఎస్‌ భుజాలపైనే పడుతుంది. పంజాబ్‌ను తలదన్నేంత ధాన్యం పండించాం. ప్రభుత్వ విజయం ప్రజా విజయం కావాలి. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం ఒక్క అంశంపైన కూడా విధానం ప్రకటించలేదు. అధికారిక చిహ్నం ప్రజల గుండెల్లో ఉంటుంది. ఘనంగా బీఆర్ఎస్‌ వార్షికోత్సవం జరుపుకోవాలి. నా ఆయుష్షు ఉన్నంతవరకూ తెలంగాణ కోసమే పనిచేస్తా. గులాబీ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత

ఆహ్వానించినట్లే ఆహ్వానించి అవమానించదలిచారు - కేసీఆర్ బహిరంగ లేఖ - KCR letters to CM Revanth

కాంగ్రెస్‌ వైఫల్యమే ఆ పార్టీని కాటు వేయబోతోంది: కేసీఆర్‌ - lok sabha elections 2024

Last Updated : Jun 2, 2024, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.