ETV Bharat / state

కేసీఆర్ ఒత్తిడి వల్లే అలా చేశాను - జస్టిస్​ పీసీ ఘోష్​ విచారణలో మాజీ ఈఎన్సీ - JUSTICE PC GHOSE ON KALESHWARAM - JUSTICE PC GHOSE ON KALESHWARAM

Justice PC Ghose on Kaleshwaram Issues : కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు ఒత్తిడి తెచ్చారని విశ్రాంత ఈఎన్సీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బ్యారేజీల నిర్వహణ సరిగా లేదని, సరిదిద్దే అవకాశం ఉన్నా తగిన రీతిలో స్పందించలేదని వెల్లడించారు. గురువారం జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రెండోరోజు విచారణ చేపట్టగా కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ మురళీధర్, సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు ప్రాజెక్ట్​కు సంబంధించిన కీలక అంశాలను వివరించారు.

PC Ghose Investigating Former Kaleshwaram ENC
PC Ghose on Kaleshwaram Issues (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 3:29 PM IST

Updated : Aug 22, 2024, 4:12 PM IST

Justice PC Ghose Investigating Former Kaleshwaram ENC : కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​, హరీశ్‌రావు ఒత్తిడి తెచ్చారని సీడీవో విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌, హరీశ్‌రావుతో పాటు ఉన్నతాధికారులు డిజైన్లు త్వరగా ఆమోదించాలని తమను ఒత్తిడికి గురిచేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణలో భాగంగా ఇవాళ (గురువారం) కమిషన్‌ ముందు సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు.

సరిదిద్దే అవకాశం ఉన్నా స్పందించలేదు : బ్యారేజీలు నిర్మించాల్సిన ప్రాంతాలకు అనుగుణంగానే డిజైన్లు రూపొందించామని సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి కమిషన్​కు వివరించారు. సీడబ్ల్యూసీకి పంపిన తర్వాత కూడా డిజైన్లలో కొన్ని మార్పులు జరిగాయని వెల్లడించారు. బ్యారేజీల నిర్వహణ సరిగా లేదని, మేడిగడ్డ ఘటన తర్వాత కూడా సరిదిద్దే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. సరిదిద్దే అవకాశం ఉన్నా తగిన రీతిలో స్పందించలేదని తెలిపారు.

ప్రాజెక్టు నిర్మాణంలోనే తప్పిదాలు : డిజైన్లు, డ్రాయింగ్‌లకు ఫైనల్ అప్రూవల్‌కు మొదటగా సంతకం చేయలేదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల సంతకాలు చేశానని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు. త్వరగా చేయాలన్న ఒత్తిడి వల్ల హడావుడిగా అన్ని అప్రూవల్ చేశామని చెప్పారు. మేడిగడ్డ ప్రతి డిజైన్‌లో సీడీవో పాటు ఎల్‌అండ్​టీ సంస్థ పాల్గొందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ సంబంధిత చర్చల్లో తాను పాల్గొనలేదని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే ప్రభుత్వం ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగాయని వివరించారు. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగా చేయలేదని, బ్యారేజీల నిర్వహణ, గేట్ల ఆపరేషన్ సైతం సరిగా చేయలేదని పేర్కొన్నారు.

జస్టిస్​ పీసీ ఘోష్​ విచారణ - 'నాణ్యత ధ్రువీకరణలో లోపాలు, పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్లు' - Justice PC Ghose on Kaleshwaram

కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ - ఈఎన్సీ మురళీధర్‌ను విచారిస్తున్న పీసీ ఘోష్

Last Updated : Aug 22, 2024, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.