Kavitha Bail Petition Hearing Postponed : దిల్లీ మద్యం కేసులో మద్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసిందని, ఈడీ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ఎస్వీ రాజు కోరారు. దీనికి కవిత తరఫు న్యాయవాదులు బుధవారంలోగా కౌంటర్ దాఖలు చేస్తే శుక్రవారం విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్న తెలిపారు. స్పందించిన ఈడీ తరఫు న్యాయవాది తమకు సమయం కావాలని గురువారంలోపు దాఖలు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారంలోపు రీజాయిండర్ దాఖలు చేయాలని కవిత న్యాయవాదులకు ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
ఈ కేసులో ఈడీ, సీబీఐలు.. ఛార్జిషీట్‌లు, కంప్లైంట్ కాపీలు దాఖలు చేయడంతోపాటు దర్యాప్తు ముగిసిందని ట్రయల్ కోర్టుకు చెప్పాయని కవిత న్యాయవాదులు సుప్రీంకు తెలిపారు. సీబీఐ కౌంటర్‌పై విచారణ చేపట్టాలని కోరగా రెండు పిటిషన్లు ఒకే సారి విచారణ చేపడతామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్‌ల ధర్మాసనం పేర్కొంది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేయడానికి ఆలస్యం ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. ఈడీ తమకు నోటీసులు ఇచ్చాక తొలిసారి కేసు ఇక్కడ విచారణకు వచ్చిందని, సవివరంగా కోర్టుకు వివరాలు అందిస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు చెప్పారు.
గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం : ఈ కేసు మొత్తంలో ఉన్నది ఒకే మహిళని, కవిత బెయిల్‌కి అర్హురాలని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న మనీష్ సిసోదియా, అర్వింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు చేశారని కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇరువురి వాదనల అనంతరం గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ తరఫు న్యాయవాదిని సుప్రీం ఆదేశించింది. శుక్రవారంలోపు రిజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సుప్రీం కోర్టు ఈనెల 27కి వాయిదా వేసింది.