ETV Bharat / state

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం - పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు - కరీంనగర్‌లో అగ్నిప్రమాదం

Karimnagar Fire Accident Today : కరీంనగర్​ జిల్లాలోని ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని సుభాష్‌నగర్‌లోని పూరిళ్లలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఆ ఇళ్లలో ఉన్న 5 గ్యాస్​ సిలిండర్లు పేలడంతో మంటలు ఆ ప్రాంతమంతా భారీగా వ్యాపించాయి.

Gas Cylinder Fire Accident in Karimnagar
Fire Accident at Subhash Nagar in Karimnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 11:30 AM IST

Updated : Feb 20, 2024, 4:24 PM IST

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు

Karimnagar Fire Accident Today : కరీంనగర్​ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న పూరిళ్లలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఆ ఇళ్లలో ఉన్న పది గ్యాస్​ సిలిండర్లు పేలాయి. దీంతో మంటలు(Fire Accident) ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. భయందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఘటనస్థలాన్ని బీఆర్ఎస్​ మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar ) పరిశీలించారు.

నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం

"ఈ పూరిళ్లలో నివాసం ఉంటున్న ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వేగంగా స్పందించి వారికి పక్కా గృహాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్​ చేస్తున్నాను. మా పార్టీ పరంగా కూడా బాధితులను ఆదుకుంటాం. తక్షణమే రూ.లక్ష పరిహారం ఇవ్వాలని కోరుతున్నాను." - గంగుల కమలాకర్​, మాజీ మంత్రి

Subhash Nagar Fire Accident in Karimnagar : ఆదర్శనగర్​లో వడ్డెర కులస్థులు గత 20 సంవత్సరాల నుంచి పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. గిరిజన దేవత సమ్మక్క సారమ్మ జాతర ఉండటంతో మేడారంకు వెళ్లే ముందు తమ ఇళ్లలో అమ్మవారి ముందు దీపాలు వెలిగించారు. దాదాపు 20 వరకు గుడిసెలు ఉండగా ఈ గుడిసెలలో 200 మంది వరకు ఉంటారు.

"ఇవాళ పొద్దున మేడారం పోయినాం. మధ్యాహ్నకు ఇలా అయ్యిందని తెలిసింది. ఇప్పుడు ఎక్కడ ఉంటాం. మా పుస్తకాలు, బట్టలు అన్ని పోయాయి. ఇప్పుడు అసలు ఎక్కడ ఉండాలి మేము. మాకున్నవన్నీ పోయాయి ఏం చేయాలో కూడా తెలియడం లేదు. " - బాధితురాలు

ఫుట్​పాత్​పై ఉన్న దుకాణాల్లో భారీ అగ్నిప్రమాదం - అగ్నికి ఆహుతైన 2 హోటల్స్

20 Huts Gutted in Karimnagar Fire Accident : వనదేవతల జాతరకు మడిగా వెళ్లడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఫ్లెక్సీలతో కవర్లతో వేసిన పూరి గుడిసెలకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున చెలరేగాయి. దాదాపు 10 వరకు సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దాదాపుగా 50 గుడిసెల వరకు మంటలు వ్యాపించాయి. వాటికి ఆనుకొని రేణి ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది సహాయం చేశారు. మంటలను ఆర్పేందుకు గ్యాస్ బెలూన్లను విసిరారు. ప్రమాదం ద్వారా సర్వం కోల్పోయాలని బోరున విలపించారు. తమ గుడిసెళ్లో విలువైన వస్తువులు ఉన్నాయని అన్ని అగ్నికి ఆహుతి అయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా కాలిపోయిందని ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని బాధితులు చెప్పారు. ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కోరారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం - రూ.5 కోట్లకు పైగా ఆస్తి నష్టం

Last Updated : Feb 20, 2024, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.