ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తాం: జస్టిస్ పీసీ ఘోష్‌ - Judicial Inquiry Kaleshwaram Update - JUDICIAL INQUIRY KALESHWARAM UPDATE

Justice PC Ghose Meeting with Kaleshwaram Project Engineers : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతోందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తామని తెలిపారు. పూర్తిగా నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తానని పేర్కొన్నారు. ప్రాజెక్ట్​ డిజైన్లు, నిర్మాణం, నమూనా అధ్యయనాలు, నిర్వహణ, తదితర విషయాల గురించి ఆరా తీసి తెలుసుకున్నారు. హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో ప్రాజెక్ట్​లో పని చేసిన ఇంజినీర్లతో ఆయన సమావేశమయ్యారు.

Judicial Inquiry On Kaleshwaram
Justice PC Ghose on Kaleshwaram Report (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 7:12 PM IST

Justice PC Ghose Meeting with Kaleshwaram Project Engineers : కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపడుతున్న న్యాయ విచారణ కొనసాగుతోందని జస్టిస్‌ పీసీ ఘోష్ తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించామని పేర్కొన్నారు. బ్యారేజీల ఇంజినీర్ల నుంచి వివరాలు తీసుకున్నామని, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణకు పిలుస్తామని స్పష్టం చేశారు. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటున్నామని, పూర్తిగా నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తానని వెల్లడించారు. హైదరాబాద్‌లోని బీర్కే భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన ఇంజినీర్లతో ఆయన సమావేశమయ్యారు. విశ్రాంత ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ మురళీధర్ రావు కూడా పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు హాజరయ్యారు.

Judicial Inquiry On Kaleshwaram : మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని విచారణ కమిషన్ ఛైర్ పర్సన్ జస్టిస్ పీసీ ఘోష్ చెప్పారు. సాంకేతిక అంశాలపై విచారణ తర్వాత ఆర్థిక అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. విచారణ ప్రక్రియ కొనసాగుతోందని, మూడు ఆనకట్టలను తాను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. విచారణ ప్రక్రియలో భాగంగా విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సీఈ చంద్రశేఖర్, ఎస్ఈ బసవరాజు, ఈఈలు యాదగిరి, ఓంకార్ సింగ్ ఇవాళ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకున్నారు.

రేపు మరోసారి రాష్ట్రానికి రానున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ - అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శన - Justice PC Ghose Commission Visit Kaleshwaram

Justice PC Ghose on Kaleshwaram Report : కాళేశ్వరం ప్రాజెక్ట్​ విషయంలో వివిధ అంశాలపై ఘోష్ ఆరా తీశారు. డిజైన్లు, నిర్మాణం, నమూనా అధ్యయనాలు, నిర్వహణ, తదితరాల గురించి తెలుసుకున్నారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తానన్నారు. పూర్తిగా నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తానని తెలిపారు. నెలాఖరులోగా గడువు ముగిసే అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని జస్టిస్ చెప్పారు. ఆనకట్టలను పరిశీలన చేసిన నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇస్తుందని వివరించారు.

కమిషన్​కు వచ్చిన ఫిర్యాదుల్లో చాల అంశాలు ఉన్నాయని భూసేకరణ, పరిహారం అంశాలను కూడా కొందరు పేర్కొన్నారని వెల్లడించారు. కమిషన్​కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తామని చెప్పారు. విజిలెన్స్ విభాగం అన్ని వివరాలు ఇచ్చిందని, వాటిని కూడా పరిశీలిస్తానని అన్నారు. కమిషన్ పని కాకపోయినా ప్రజల కోసం తగిన రక్షణ చర్యలు, మరమ్మతులు చేయాలని చెప్పానని అందుకు అనుగుణంగా ఇంజినీర్లు, సంస్థలు పనులు చేస్తున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు.
కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ అప్డేట్ - ఇవాళ కమిషన్ ముందుకు మూడు బ్యారేజీల ఈఈలు - KALESHWARAM PROJECT JUDICIAL INQUIRY LATEST UPDATE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.