ETV Bharat / state

జస్టిస్​ పీసీ ఘోష్​ విచారణ - 'నాణ్యత ధ్రువీకరణలో లోపాలు, పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్లు' - Justice PC Ghose on Kaleshwaram

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 7:50 AM IST

Updated : Aug 22, 2024, 9:20 AM IST

Justice PC Ghose on Kaleshwaram Project Issue : కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత తనిఖీలకు తిలోదకాలు ఇచ్చినట్లు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణలో బయటపడింది. మాజీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ గతంలో ఇచ్చిన అఫిడవిట్‌పై క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసిన జస్టిస్‌ ఘోష్‌ డీపీఆర్‌ తర్వాత కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. గురువారం కూడా హాజరుకానున్న మాజీ ఈఎన్సీ మురళీధర్‌ మరికొన్ని ప్రశ్నలకు వివరాలు అందించనున్నారు.

Justice PC Ghose Cross Examine ENC Muralidhar
Justice PC Ghose Cross Examine ENC Muralidhar (ETV Bharat)

Justice PC Ghose Cross Examine Ex ENC Muralidhar : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా సుమారు 50 మందికి పైగా ఇంజినీర్లు, ఐఏఎస్‌ అధికారులు, గుత్తేదారుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ప్రారంభించింది. మొదటి రోజు బీఆర్కే భవన్‌లో నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ను జస్టిస్‌ పీసీ ఘోష్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. నాణ్యత ధ్రువీకరణలో లోపాలు, పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్లు ఇవ్వడం ఆ తర్వాత చెల్లింపులు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి.

అంచనాలు, డిజైన్లలో మార్పులకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవడం వంటి అంశాలు కూడా క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజీ నాణ్యత తనిఖీలకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ విభాగం వద్ద ఒకే ఒక పరిశీలన నివేదిక ఉందేంటని జస్టిస్‌ ఘోష్‌ మాజీ ఈఎన్సీని ప్రశ్నించారు. రెగ్యులర్‌గా తనిఖీలు చేసి లోపాలుంటే నివేదించాల్సి ఉంటుందని మురళీధర్‌ తెలిపారు.

నేటి నుంచి కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ - అఫిడవిట్లపై జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్‌ ఎగ్జామినేషన్ - JUSTICE PC GHOSE KALESHWARAM

నాణ్యత ధ్రువీకరించకుండానే బిల్లులు : 15 రోజులకోసారి అయినా నాణ్యతా తనిఖీలు చేయాలని అలా జరగకపోతే అది ఒక ప్రధాన లోపమవుతుందని అభిప్రాయపడ్డారు. నాణ్యత పరీక్షలు చేసి ధ్రువీకరించకుండానే బిల్లులు చెల్లింపు అంశం కూడా క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో వెలుగు చూసింది. ఇంజినీర్లు అంచనాలు తయారు చేసిన తర్వాత చివరకు ఆమోదం తెలిపేది ప్రభుత్వమేనని మురళీధర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏ స్థాయిలో జరుగుతుందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించగా ఉన్నత స్థాయిలోనేనని మాజీ ఈఎన్సీ సమాధానమిచ్చారు.

నేడు మరోసారి విచారణ : విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వరుసగా రెండో రోజు కూడా కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు. కొన్ని ప్రశ్నలకు మురళీధర్ బుధవారం సమాధానం చెప్పలేదు. దీంతో గురువారం మరోమారు ఆయన కమిషన్ ముందు హాజరు కానున్నారు. అటు మరో విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ నరేందర్ రెడ్డి కూడా కమిషన్ ముందు హాజరుకానున్నారు. గతంలో ఆయన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ - సీడీఓ బాధ్యతలు చూశారు. ఆనకట్టల డిజైన్ల విషయంలో సీడీఓ పాత్ర కీలకం. నరేందర్ రెడ్డి కూడా ఇప్పటికే ఆఫిడవిడ్ దాఖలు చేశారు. అందులోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆయనను విచారణ చేయనున్నారు.

కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ - ఈఎన్సీ మురళీధర్‌ను విచారిస్తున్న పీసీ ఘోష్

కీలక దశకు చేరుకున్న కాళేశ్వరంపై విచారణ - గత ప్రభుత్వ పెద్దలపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఫోకస్‌ - PC Ghosh Commission

Last Updated : Aug 22, 2024, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.