ETV Bharat / state

క్యాన్సర్​తో పోరాడుతున్న అభిమానికి జూ.ఎన్టీఆర్​ వీడియోకాల్​ - ధైర్యంగా కోలుకుని బయటకు రావాలని ఆకాంక్ష - JR NTR Video Call To His Fan - JR NTR VIDEO CALL TO HIS FAN

JR NTR Video Call To His Fan : క్యాన్సర్​తో బాధపడుతున్న తన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియోకాల్ చేసి ధైర్యం చెప్పారు. ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానికి ధైర్యం చెప్పాడు. ఆ వ్యక్తికి వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించి, అభిమానులు తనకు ఎంతో ముఖ్యమో మరోసారి రుజువు చేశాడు.

JR NTR Video Call To His Fan
JR NTR Video Call To His Fan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 7:24 PM IST

Updated : Sep 14, 2024, 7:58 PM IST

Junior NTR Video Call To His Fan : తనని ఇష్టపడే అభిమానులు వారి కుటుంబ సభ్యులపట్ల జూనియర్​ ఎన్టీఆర్​ ఎంతో ఆప్యాయత చూపిస్తుంటారు. క్సాన్సర్​ మహమ్మారితో బాధపడుతున్న తన అభిమానికి వీడియో కాల్​ చేసి ధైర్యం చెప్పి తన గొప్ప మనసును చాటుకున్నారాయన. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

అభిమానికి ధైర్యం చెప్పిన జూనియర్​ ఎన్టీఆర్​ : క్యాన్సర్​తో బాధపడుతున్న తన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియోకాల్ చేసి ధైర్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్ కొంతకాలంగా ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో తాను చనిపోయేలోపు దేవర చూడాలని కోరుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. కౌశిక్ తల్లి ఎన్టీఆర్ అభిమానుల ద్వారా ఆ విషయాన్ని తారక్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్ కు వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించారు. కౌశిక్ ధైర్యంగా కోలుకొని బయటకు రావాలని, దేవర సినిమా చూడాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కౌశిక్ ను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు.

ధైర్యంగా కోలుకుని బయటకు రావాలి -దేవర చూడాలి : 'ధైర్యంగా క్యాన్సర్​ నుంచి కోలుకుని బయటకు రావాలి. దేవర సినిమా చూడాలి. సినిమా అనేది తర్వాత విషయం ముందు నువ్వు కోలుకుని రావాలి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి' అని కౌశిక్​తో జూనియర్​ ఎన్టీఆర్​ అన్నారు. 'అన్నా మిమ్మల్ని అస్సలు చూస్తానని ఊహించలేదు అని కౌశిక్​ అనగా నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో అని తారక్​ బదులిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎల్లప్పుడూ షూటింగ్​లలో బిజీబిజీగా ఉండే హీరో ఓ సామాన్యుడికి కాల్​ చేసి మాట్లాడటం అది కూడా క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ అబ్బాయికి అంటే అర్థం చేసుకోవచ్చు జూనియర్​ ఎన్టీఆర్​ గొప్పతనాన్ని. కౌశిక్​తో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఆయన అభిమానులు ఆ వీడియోను ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

Last Updated : Sep 14, 2024, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.