ETV Bharat / state

సమీకృత గురుకులాలకు నేడే శ్రీకారం - కొందుర్గ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన

యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి నేడు శ్రీకారం - రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మాణ పనులు ప్రారంభం

Residential Schools Foundation In Telangana
Integrated Residential Schools Foundation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 6:55 AM IST

Integrated Residential Schools Foundation In Telangana : రాష్ట్రంలో సరికొత్త గురుకులాలకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో ఇవాళ పనులు మొదలు పెట్టనున్నారు. షాద్​నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒకే చోట సమీకృత సముదాయంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గురుకులాలకు నేడు శ్రీకారం : హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు రూ.12 వేల కోట్లతో వీటిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మొదటి విడతలో స్థలాలు అందుబాటులో ఉన్న కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు.

మిగతా నియోజకవర్గాల్లోనూ స్థలాలను గుర్తించాలని అధికారులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈ స్కూళ్లను నిర్మించనుంది. సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాల సముదాయానికి సుమారు రూ.100 నుంచి రూ.125 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాది రూ.5 వేల కోట్లతో గురుకుల సముదాయాల నిర్మాణం ప్రారంభిస్తున్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు 1023 ఉన్నాయి. వీటిలో దాదాపు 662 అద్దె భవనాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ ఒకే డిజైన్‌లో నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

సౌర, వాయు విద్యుత్​ను వినియోగించేలా, వాన నీటిని సంరక్షించేలా డిజైన్ చేశారు. పన్నెండో తరగతి వరకు సుమారు 2 వేల 560 మంది విద్యార్థులు, దాదాపు 120 మంది బోధన సిబ్బందికి సరిపోయేలా క్యాంపస్‌లకు ప్రణాళిక చేశారు. ఒకేసారి 900 మంది విద్యార్థులు తినేలా డైనింగ్ హాల్, డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ కేంద్రాలు, గ్రంథాలయాలు, లేబొరేటరీలు, క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులు, అవుట్ డోర్ జిమ్​తో మినీ ఎడ్యుకేషన్ హబ్‌లా ఉండేలా ప్రణాళికలు చేశారు.

సర్కారు పాఠశాలలు, సమీకృత గురుకులాలపై సీఎం సమీక్ష - మూడేళ్లలో రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు - Cm Revanth Reddy Review On Schools

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.