ETV Bharat / state

ఆక్ర‌మ‌ణ‌ల‌కు ఆస్కారం లేకుండా యాప్‌ - సిద్ధం చేస్తున్న హైడ్రా - RANGANATH REVIEW MEETING

చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల గుర్తించేందుకు ఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారులతో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స‌మీక్ష‌ - ఆక్ర‌మ‌ణ‌ల‌కు ఆస్కారం లేకుండా యాప్‌ను తీసుకు వ‌స్తున్న హైడ్రా.

HYDRA REVIEW MEETING
HYDRA Commissioner Ranganath Review Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 7:29 PM IST

Updated : Oct 7, 2024, 10:18 PM IST

Hydra Commissioner Ranganath Review Meeting : హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లపై గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు, పౌర సమాజంతోపాటు ఉన్నత న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. గ్రేటర్ పరిధితో పాటు ఓఆర్ఆర్ లోపల చెరువుల సంఖ్యతోపాటు వాటి ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లపై రోజుకో లెక్క పూటకో మాట వినిపిస్తుండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో లేక్ ప్రొటక్షన్ కమిటీ ఛైర్మన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల గుర్తించేందుకు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌న్‌ సెంట‌ర్, స‌ర్వే ఆఫ్ ఇండియా అధికారుల‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. ఓఆర్​ఆర్ ప‌రిధిలో ఎన్ని చెరువులున్నాయి, ఎంత మేర ఆక్ర‌మ‌ణ‌లకు గుర‌య్యాయో లెక్క‌లు తేల్చాలంటూ అధికారుల‌కు సూచించారు. ఆయా చెరువుల ఎఫ్​టీఎల్ నిర్ధారణకు శాస్త్రీయ పద్దతులు అనుసరించే అంశాలపై సమీక్షించారు. అలాగే గతంలో నిర్ధారించిన ఎఫ్​టీఎల్ సరిగా లేని పక్షంలో వాటిని సవరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు.

ఆక్ర‌మ‌ణ‌ల‌కు ఆస్కారం లేకుండా యాప్‌ : న‌గ‌రంలో చెరువులు, ప్ర‌భుత్వ స్థ‌లాలు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు నిర్దేశించిన స్థ‌లాలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుందని రంగనాథ్ పేర్కొన్నారు. ఆక్ర‌మ‌ణ‌ల‌కు ఆస్కారం లేకుండా క్షణాల్లో సమాచారం వచ్చేలా ప్రత్యేక యాప్​ను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని, క్షేత్ర స్థాయిలో అధికారుల పరిశీలన, చ‌ర్య‌ల న‌మోదు తదితర వివరాలను యాప్​లో నమోదు చేయవచ్చని రంగనాథ్ తెలిపారు.

ఓఆర్ఆర్ ప‌రిధిలో చెరువుల ఆక్రమణలు : 45 ఏళ్ల డేటా ఆధారంగా చెరువుల ఎఫ్‌టీఎల్‌, మాగ్జిమ‌మ్ వాట‌ర్ స్ప్రెడ్ ఏరియా గుర్తించాలని, ఇందుకు ఎన్​ఆర్​ఎస్​ఏ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌న్‌ సెంట‌ర్, ఇరిగేష‌న్ విభాగాల డేటాతో స‌రిపోల్చాలని నిర్ణయించారు. అలాగే విలేజ్ మ్యాప్స్‌, భూ వినియోగం సర్వే నంబ‌ర్ల‌తో స‌హా స‌మ‌చారం ఇచ్చే కాడాస్ట్రల్ మ్యాప్స్, 45 ఏళ్ల‌లో పూర్తి స్థాయిల చెరువు నీరు విస్త‌రించిన తీరుపై స‌మాచారం సేక‌రించాలని రంగనాథ్ అధికారులకు సూచించారు. తొలుత హిమాయ‌త్ సాగ‌ర్‌తో ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్లు గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విష‌యంలో పాటించేందుకు చ‌ర్య‌లు చేపట్టాలని ఆదేశించారు. చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌పై 2018లో కాగ్ ఇచ్చిన నివేదిక ప‌రిశీలించిన అధికారులు ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు ఆస్కారం లేకుండా చెరువుల‌ను గుర్తించేందుకు కసరత్తు చేయాలని వివరించారు.

అలాగే చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై ఇత‌ర రాష్ట్రాల్లో అనుస‌రిస్తున్న విధానాల‌పైనా కూడా సమీక్ష సమావేశంలో చర్చించారు. ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన చెరువుల‌ను ప‌రిర‌క్షించ‌డ‌మే కాదు వాటికి పూర్వ‌వైభ‌వం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుందన్నారు. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన చెరువుల్లో వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొల‌గించే పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. మొద‌టి ద‌శ‌లో సున్నం చెరువు, అప్పాచెరువు, ఎర్ర‌కుంట‌, కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువుతో ప‌నులు ప్రారంభించాల‌ని, వాటికి పూర్వవైభవం తీసుకొచ్చేలా చూడాలని నిర్ణయించారు.

కూల్చివేతలకు చిన్న బ్రేక్ ఇచ్చిన హైడ్రా - డిసెంబర్​ నాటికి ఆ చెరువుల సుందరీకరణ! - HYDRA on of Encroached Ponds In Hyd

హైడ్రా ఆర్డినెన్స్​కు రాష్ట్ర గవర్నర్​ ఆమోదం - గెజిట్​ రిలీజ్​ - GOVERNOR APPROVED HYDRA ORDINANCE

Last Updated : Oct 7, 2024, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.