Hyderabad youth dies in shooting in America : అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ మరణించాడు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీలైనంత త్వరగా తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి రప్పించాల్సిందిగా తండ్రి కోరాడు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. వాషింగ్టన్లో దుండగుల కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
అమెరికాలో కాల్పుల కలకలం - హైదరాబాద్ యువకుడి మృతి - MAN DIES AFTER SHOOTING IN AMERICA
అమెరికాలో కాల్పుల కలకలం - హైదరాబాద్ వాసి మృతి - కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

Published : Jan 20, 2025, 12:21 PM IST
|Updated : Jan 20, 2025, 3:51 PM IST