ETV Bharat / state

కొద్దిరోజులు హడావిడి చేసి ఊరుకోవడం కాదు - ఆక్రమణలకు పాల్పడాలంటేనే భయపడేలా చేస్తాం : రంగనాథ్ - Ranganath about Hydra Operations - RANGANATH ABOUT HYDRA OPERATIONS

Commissioner Ranganath about Hydra : కొద్ది రోజులు హడావిడి చేసి ఊరుకోవడం కాకుండా, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతుల ముసుగు తొడుగుతున్నారని తెలిపిన రంగనాథ్, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోగా వాటిని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఎఫ్​టీఎల్​లోని ప్రతి అపార్ట్‌మెంట్ కూల్చాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామని హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో రంగనాథ్‌ తెలిపారు.

AV RANGANATH ON HYDRA OPERATION
Hydra Commissioner Ranganath about Illegal Constructions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 8:52 AM IST

Updated : Aug 31, 2024, 9:37 AM IST

Hydra Commissioner Ranganath about Illegal Constructions : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణదారుల పాలిట సింహస్వప్నంగా మారిన హైడ్రా మరింత కఠినంగా వ్యవహరించబోతుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథ్‌, భూముల ధరలు పెరిగినందు వల్లే ఆక్రమణలు జరుగుతున్నాయని వెల్లడించారు. నిజాయతీ కలిగిన బిల్డర్లను హైడ్రా ఇబ్బంది పెట్టదన్న కమిషనర్‌, ఎవరైనా అధికారులు బిల్డర్లను వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కొంతమంది పెద్ద బిల్డర్లు భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువులను పూడ్చేస్తున్నారని, వాటిని క్రమంగా చదును చేసి ఆక్రమించుకుంటున్నారని రంగనాథ్‌ వెల్లడించారు. ఫలితంగా చెరువులు, నాలాలు కుంచించుకుపోయి వరద నీరు నగరాన్ని ముంచెత్తుతున్నట్లు వివరించారు. ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్ అనే అంశాలు ఇప్పటివి కావని, ఎప్పటి నుంచో ఉన్నవేనని అన్నారు. ఎఫ్​టీఎల్ పరిధిలో పట్టా భూములుంటే వ్యవసాయం చేసుకోవాలే తప్ప నిర్మాణాలు చేపట్టకూడదని వివరించారు. పట్టా పేరుతో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే మాత్రం కూల్చివేతలు తప్పవంటూ ఇటీవలి ఎన్​-కన్వెన్షన్‌ ఘటనను ఉదహరించారు.

త్వరలోనే హైడ్రా పరిధి మరింత విస్తరించేలా : ఎఫ్​టీఎల్, బఫర్‌జోన్‌ల పైన ప్రజలు అవగాహన తెచ్చుకుంటున్నారన్న హైడ్రా కమిషనర్‌, వాటి పరిధిలోని భూములను కొనుగోలు చేయకుండా అప్రమత్తమవుతారని తెలిపారు. ఎఫ్​టీఎల్​ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు నోటీసులు అవసరం లేదని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పాయన్న రంగనాథ్‌, అందుకు చట్టాలు సైతం ఉన్నాయన్నారు. కొంతమంది పలుకుబడి ఉపయోగించి అనుమతుల ముసుగు తొడిగిన అక్రమ నిర్మాణాలను సైతం వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

కూల్చివేతలకు వెళ్లే ముందు ఆయా నిర్మాణాలకు సంబంధించి లోతైన అధ్యయం, పక్కా ప్రణాళికతోనే అడుగు ముందుకు వేస్తున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. 2, 3 నెలలు హడావిడి చేసి మాయమైపోవడం కాకుండా, పదేళ్లలో నగర రూపురేఖలు మారేలా పని చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. ప్రస్తుతం హైడ్రా పరిధి ఓఆర్​ఆర్​ వరకే ఉన్నప్పటికీ భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు. అలాగే హెచ్ఎండీఏ, జీహెచ్​ఎంసీపైనా హైడ్రా నిఘా ఉంటుందని, అక్రమ అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేస్తుందని రంగనాథ్ తెలిపారు.

'హైదరాబాద్‌లో ఆక్రమణలు ఆపకపోతే ఐదేళ్లలో చెరువులుండవు. హైదరాబాద్​ మ్యాప్​లోనే చెరువులు అనేవి ఉండవు. ఎఫ్‌టీఎల్‌లోని వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిని మాత్రం వదిలిపెట్టబోం. చెరువులు, నాలాలు ఆక్రమించాలంటే భయపడేలా చేస్తాం'- రంగనాథ్‌, హైడ్రా కమిషనర్‌

రాంనగర్‌లో ఆక్రమణలు పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ - Ranganath Visit To Musheerabad

హైడ్రా నోటీసులు ఇవ్వదు - కూల్చడమే : కమిషనర్ రంగనాథ్ - Commissioner Ranganath On HYDRA

Last Updated : Aug 31, 2024, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.