Huge Mango Sales at Bata Singaram Fruit Market : ఈ ఏడాది వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో చీడపీడలు, తెగుళ్లు మామిడి కాతపై తీవ్ర ప్రభావం చూపాయి. మధ్యలో చలి కారణంగా పూత, పిందె రాలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడులు పడిపోయాయి. తాజాగా వేసవి ఎండలు, వడగాలులు, అకాల వర్షాల భయంతో రైతులు పక్వానికి రాక ముందే మామిడి కాయలను మార్కెట్‌కు తీసుకొస్తున్నారు.
Mango Supply Increasing : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రైతులు గత మాసం నుంచి మామిడి (Mango) కాయలు విక్రయాల కోసం హైదరాబాద్ శివారు బాటసింగారం పండ్ల మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. రైతులు, కమీషన్ ఏజెంట్లు, చిరు వ్యాపారులతో మార్కెట్ ప్రాంగణం అంతా మామిడి కాయల క్రయ, విక్రయాలతో కళకళలాడుతోంది. ఆరంభంలో ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, గత మూడు నాలుగు రోజులుగా సరకు రాక బాగా పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల రైతులు (Farmers) ఆందోళనకు గురవుతున్నారు.
Mango Cultivation Decreasing : పదేళ్ల కిందట రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో మామిడి తోటల సాగు ఉండగా, అవి క్రమేపీ తగ్గిపోతూ ప్రస్తుతం 4 లక్షల 10 వేల ఎకరాలకు పరిమితమైంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా సగటు ఎకరం సాగుకు రూ.40 నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి (Investment) అవుతుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో మామిడికి టన్ను ధర కనిష్ఠంగా రూ.35 వేలు, గరిష్ఠ ధర రూ.75 వేల చొప్పున లభిస్తుంది. కాయ నాణ్యత ఆధారంగా ధరలు (Price) లభిస్తున్నాయని రైతులు, కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు.
Mango Crop Loss In Telangana : 'ఫల రాజా' ఎంత పనైపాయే.. ధరలు లేక రైతన్నల విలవిల
కాల్షియం కార్బైడ్ వాడకం నిషేధం : బాటసింగారం పండ్ల మార్కెట్‌కు గత ఏడాది ఇదే సమయానికి 11 లక్షల 50 వేల టన్నుల మామిడి సరకు వచ్చింది. అదే ఈ ఏడాది ఇప్పటి వరకు 8 లక్షల 50 వేల టన్నుల మామిడి పంట అమ్మకానికి వచ్చింది. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో తినే మామిడి పండ్లలో అధిక శాతం ఈ మార్కెట్ నుంచి వస్తున్న నేపథ్యంలో కాయలు పక్వానికి వచ్చేందుకు వినియోగించే కాల్షియం కార్బైడ్ రసాయనం (Calcium carbide) వాడకాన్ని మార్కెటింగ్ శాఖ పూర్తిగా నిషేధించింది.
Mango Crop price in TS: మామిడి పంట ధర దిగాలు.. రైతన్న కుదేలు