How to Find Fake Loan Apps in Telugu: "లోన్ యాప్స్.." ఈ పదం ఈ మధ్య బాగా వినపడుతోంది. ఏదో అవసరం పడిన వాళ్లు.. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు కావాలనుకునేవారు ఎక్కువగా వీటి మాయలో పడుతున్నారు. ఎంతో కొంత అప్పు తీసుకుంటున్నారు. క్షణాల్లో డబ్బు అకౌంట్లో పడడంతో అవసరం తీరిపోయిందనుకుంటున్నారు. కానీ.. ఆ తర్వాతే అసలు కష మొదలవుతుంది. తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేకపోతే ఊహించలేని రీతిలో వడ్డీ విధిస్తున్నాయి ఫేక్ లోన్ యాప్స్.
అంతేకాదు.. సకాలంలో మొత్తం అప్పు తిరిగి చెల్లించినా.. ఇంకా చెల్లించాలని అడుగుతుంటాయి. చెల్లించకపోతే తీవ్రస్థాయిలో వేధిస్తుంటాయి. ముందుగానే పర్సనల్ సమాచారం సేకరించి పెట్టుకుంటున్న మోసగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి మీ వాళ్లకు పంపిస్తామంటూ బెదిరిస్తుంటారు. దీంతో.. ఇటు ఇంట్లో చెప్పలేక, అటు వాళ్ల వేధింపులు భరించలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి.. మోసపూరిత లోన్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ఏదీ జన్యూన్ యాప్.. ఏది ఫేక్ యాప్.. అనేది తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మరి.. వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లోన్ యాప్స్ పేరిట మోసం.. రూ.300 కోట్లు స్వాహా.. నిందితులంతా చైనీయులే!
అస్పష్టమైన నిబంధనలు: మోసపూరిత లోన్ యాప్స్ తాము విధించే వడ్డీ రేట్లను సరిగా చూపించవు. నిబంధనలు క్లారిటీగా ఉండవు. నిజానికి అప్పు ఇచ్చే సంస్థలు వడ్డీ రేట్లతో సహా అవసరమైన మొత్తం సమాచారాన్ని పారదర్శకంగా ముందే రుణం తీసుకునేవారికి అందించాలి. కానీ.. మోసపూరిత రుణ యాప్‌లు రిజర్వ్ బ్యాంక్ రూల్స్ గానీ, రుణ ఒప్పందాన్ని గానీ, రుణ మంజూరు పత్రాన్ని గానీ అప్పు తీసుకునే వారికి ఇవ్వవు. లోన్ అగ్రిమెంట్ పేపర్లో అప్పు ఇచ్చే సంస్థ పేరు, ప్రాసెసింగ్ ఫీజులు, వార్షిక వడ్డీ రేటు, తిరిగి చెల్లించాల్సిన కాలపరిమితి మొదలైన సమాచారాన్ని ఇవ్వాలి. కానీ.. ఫేక్ రుణ యాప్‌లు ఇలాంటి సమాచారం ఇచ్చేందుకు అంగీకరించవు.
loan apps: రుణ యాప్‌లు వేధిస్తున్నాయా.?.. అయితే ఈ సెక్షన్స్ గురించి తెలుసుకోండి..
రెగ్యులేటరీ ఆమోదం అండ్ లైసెన్స్: చట్టబద్ధంగా అప్పులు ఇచ్చే యాప్స్ అయితే.. రెగ్యులేటరీ ఆమోదించిన సర్టిఫికెట్, లైసెన్స్ అందరికీ కనిపించేలా చూపిస్తాయి. కానీ.. మోసపపూరిత సంస్థలు ఇలాంటివి ఏవీ చూపించవు.
సమాచారం: నకిలీ యాప్‌లు నిర్వహిస్తున్న వారు తమ సంస్థ అడ్రస్ తప్పుగా ఇస్తుంటారు. ఒకటీ రెండు పదాల్లోనే చిరునామా చూపిస్తుంటారు. అందువల్ల ముందుగా యాప్‌ని నిర్వహిస్తున్న సంస్థ వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. వారి కార్యాలయం భారతదేశంలోనే ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? వెబ్‌సైట్ వివరాలు, యాప్ ద్వారా రుణం పంపిణీ చేసే వివరాలు.. ఇలా పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఫేక్ యాప్స్ ఈ వివరాలు క్లారిటీగా చూపించవు.
రుణగ్రహీతల రక్షణ కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు.. వాటి ప్రయోజనమేమిటంటే?
అప్పు తీసుకునే వారి డీటెయిల్స్ : అప్పు తీసుకునే వారి వ్యక్తిగత సమాచారాన్ని కొంత మేర మాత్రమే ఈ యాప్స్ తీసుకోవాలి. కానీ.. పూర్తి పర్సనల్ డీటెయిల్స్ తోపాటు వారికి అవసరం లేని సమాచారం కూడా అడుగుతుంటారు. మీ ఆర్థిక అంశాల గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా.. మీ వివరాలను అడుగుతుంటే ఆ యాప్ మోసపూరితమైనదని గుర్తించాలి.
ఇవి చెక్ చేయండి : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. మొబైల్ ప్లే స్టోర్లలో దాదాపుగా 600 పైగా చట్టవిరుద్ధ రుణ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి.. రుణం కోసం ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు.. ఆ యాప్ పేరు, దాని రేటింగ్, యాప్ స్టోర్లో సమీక్షలు, ఇతర వివరాలను చూసుకోండి.
లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: యాప్ స్టోర్‌లో లిస్ట్ చేయని యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే తక్కువ వడ్డీతో.. ఎక్కువ డబ్బులు ఇస్తాం అంటూ.. SMS లేదా ఇమెయిల్ రూపంలో వచ్చే లింక్‌ల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి. అలాగే.. మీ ఫోన్లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఏదైనా మోసపూరిత యాప్ మిమ్మల్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తే.. హెచ్చరిస్తుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా.. లోన్ యాప్స్ ద్వారా డబ్బు అప్పుగా తీసుకోవాలనే ఆలోచన అస్సలే చేయకండి. కావాలంటే.. మీ బ్యాంకు ద్వారా ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లండి. లేదంటే తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోండి. లేదంటే.. క్రెడిట్ కార్డు తీసుకోండి. అంతేగానీ.. ఈ ఫేక్ యాప్స్ బారిన పడి కోరి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
రుణయాప్‌ల నిర్వాహకులు కొత్త పంథా.. మహిళలు, యువతే లక్ష్యం
Loan apps: రుణ యాప్‌ల వేధింపులు.. డబ్బు ఎరవేసి బాధితులకు చుక్కలు