ETV Bharat / state

తెలంగాణలో రంగుల పండుగ - ఉత్సాహంగా పాల్గొన్న నేతలు, అధికారులు - How Holi Celebrated in Telangana

Holi Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. కేరింతలు కొడుతూ.. ఉల్లాసంగా గడిపారు. వసంతకేళి జీవితంలో కొత్తదనం తీసుకురావాలని ఆకాంక్షించారు. సామూహికంగా వేడుకలు జరుపుకుంటూ పండగను ఆసాంతం ఆస్వాదించారు.

Political Leaders Participating in Holi
Holi Celebrations in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 12:38 PM IST

Updated : Mar 25, 2024, 6:48 PM IST

Holi Celebrations in Telangana : హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి. రాత్రి కామదహనంతో ప్రారంభమైన పండుగ కోలాహలంగా కొనసాగింది. బేగంబజార్‌లో 'రాజస్థాన్ సమాజ్', 'గో వాట్స్ ఫౌండేషన్', 'సకల ప్రభాత్ ఫరీ పరివార్' సంయుక్త ఆధ్వర్యంలో.పెద్దఎత్తున తరలివచ్చిన కుటుంబాలు రంగేలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

తెలంగాణలో రంగుల పండుగ ఉత్సాహంగా పాల్గొన్న నేతలు అధికారులు

ఓయూ ఆర్ట్స్ కళాశాల, వసతిగృహాల వద్ద సంబరాలను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. సికింద్రాబాద్‌, కూకట్‌పల్లిసహా పలు చోట్ల పర్వదినాన్ని చిన్నాపెద్ద కలిసి ఉత్సాహంగా చేసుకున్నారు. బోయిన్‌పల్లిలోని నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఓ బస్తీలో చిన్నారులతో కలిసి చిక్కడపల్లి పోలీసులు హోలీ సరదా గడిపాడు..

తెలంగాణలో హోలీ సంబురం - ఈ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా? - HOLI CELEBRATIONS 2024

BJP MP Bandi Sanjay Holi Celebrations : హోలీ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ లోక్​సభ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కరీంనగర్​లో పండుగ సంబురాల్లో పాల్గొన్నారు. ఉదయం ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి​పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లో సతీమణితో కలిసి హోలీ సంబురాలు జరుపుకున్న బండి సంజయ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రంగులు పూశారు. అనంతరం ద్విచక్ర వాహనంపై వీధుల్లో తిరుగుతూ కనిపించినవారందరికీ రంగులు పూసి పండుగ శుభాాకాంక్షలు తెలియజేశారు.

హనుమకొండలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్​ యువత హొలీ సంబరాలతో హోరెత్తించారు. పరస్పరం రంగులు పూసుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిజామాబాద్‌లో డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హోలీకి సరికొత్త శోభను తెచ్చారు. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా చిన్నా పెద్దా తేడా లేకుండా రంగుల పండగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకున్నారు.

హోలీ రోజున రంగులు ఎందుకు చల్లుకుంటారు? దీని వెనుక ఉన్న కథేంటి? - holi festival importance

Nirmal Holi Celebrations : నిర్మల్‌ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఎస్పీ జానకి శర్మిల, ఏఎస్పీ కాంతిలాల్ పటేల్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకున్నారు. డిజే పాటలకు సిబ్బంది నృత్యాలు చేసి సందడిచేశారు. రామగుండం సీపీ శ్రీనివాస్‌ పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో హోలీ ఆడారు. రంగుల వేడుకను ప్రతీ ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని కమిషనర్‌ ఆకాంక్షించారు.

Holi At Peddapalli : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రంగులు పూసి సందడి చేశారు. తాను సైతం కార్యకర్తలకు రంగుల పుశారు. అనంతరం తెలంగాణ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ రంగుల పండుగను ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకుని సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. తమ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రంనాధ్ సిబ్బందితో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించారు. ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ రంగుల పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Telangana Political Leaders Holi Celebrations : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హొలీ పండగ సంబరాలు అంబరాన్ని తాకాయి. పండగను సంతోషకర వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరిజిల్లా నాగాయపల్లి తండాలో గిరిజన బంజారాలతో కలసి ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య సంబరాలు ఉత్సహంగా చేసుకున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా హోలీ జోష్‌ కన్పించింది. జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వేడుకలు ఉత్సహంగా జరపుకుని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని రాములోరి ఆలయంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. సీతారాములపై రంగులు చల్లిన అర్చకులు వేడుకలను వైభవంగా జరిపారు. ఆలాయనికి విచ్చేసిన భక్తులు, స్వామివారి వద్ద తయారు చేసిన వసంతాన్ని చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ జరుపుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సందడిగా ముందస్తు హోలీ సంబరాలు - EARLY Holi Celebrations 2024

Last Updated : Mar 25, 2024, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.