ETV Bharat / state

ఒకేరోజు ఏసీబీ వలలో చిక్కిన ముగ్గురు అధికారులు- రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారుగా! - Bribe Cases in Telangana

Govt Officers Corruption in Telangana : రాష్ట్రంలో రోజు రోజుకు లంచం తీసుకుంటూ చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఓ కేసు విషయంలో మహిళా ఎస్సై, ఛార్జీ మెమోను ఎత్తివేసే విషయంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌, మెడికల్‌ షాపు అనుమతి విషయంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అడ్డంగా దొరికారు.

RTC Depot Manager Bribe Case in Hanamkonda
SI Bribe Case in Asifabad
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 1:37 PM IST

Govt Officers Corruption in Telangana : రాష్ట్రంలో ఓ ముగ్గురు ఉద్యోగులు వారి చేతివాటాన్ని చూపించి అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. అందులో ఒకరు మహిళా ఉద్యోగి ఉన్నారు. ఈ ముగ్గురిది రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలు. వారు విధులు నిర్వహిస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. అనంతరం వారిపై తగిన చర్యలు తీసకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

RTC Depot Manager Bribe Case in Hanamkonda : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండెపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్‌ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తనపై జారీ అయిన ఛార్జి మెమోను ఎత్తివేయాలని డ్రైవర్‌ రవీందర్‌ డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ వద్దకు వెళ్లి అడగ్గా అతను రూ.30 వేలు డిమాండ్‌ చేశారు.

రవీందర్‌ మొదట రూ.10 వేలు ఇచ్చారు. మిగిలిన రూ.20 వేలు ఇచ్చాకే ఛార్జి మెమో ఎత్తేస్తానని శ్రీకాంత్‌ చెప్పడంతో రవీందర్‌ వరంగల్‌ అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Department) అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌లో డీఎం శ్రీకాంత్‌కు నగదు ఇస్తుండగా పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్‌ చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.

ఈఈ జగజ్యోతి అరెస్ట్​ - రూ.64 లక్షలు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం

SI Bribe Case in Asifabad : ఆసిఫాబాద్‌ మండలంలోని బూరగూడలో మార్చి 31న ఓ ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ కేసు విషయంలో స్టేషన్‌ బెయిల్‌ కోసం ఎస్సై రాజ్యలక్ష్మి(SI Rajyalakshmi Bribe Case) రూ.40 లంచం డిమాండ్‌ చేశారు. కారు యజమాని యాహియాఖాన్‌ అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరకు రూ.25 వేలకు ఒప్పుకొన్నారు.

ఈ విషయాన్ని బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చెప్పాడు. వారు సూచించిన విధంగా సోమవారం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైకి రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఇతర పోలీసు అధికారులతో వచ్చి పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఎస్సైని కరీంనగర్‌ అనిశా కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - లంచం తీసుకుంటూ చిక్కిన శామీర్​పేట ఎమ్మార్వో

ACB Traps Drug Inspector in Nalgonda : నల్గొండ జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతంలో నూకల వెంకట్‌రెడ్డి చారిటబుల్ ఆసుపత్రిలో మెడికల్‌ షాపు అనుమతి కోసం ఇన్‌ఛార్జి చిట్టెపు సైదిరెడ్డి ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేసుకున్నారు. దీన్ని నెల రోజుల క్రితం పరిశీలించిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమేశ్వర్‌ అనుమతి ఇవ్వడానికి రూ.20 వేలు ఇవ్వాలని కోరాడు. చివరికి రూ.18 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం మధ్యాహ్నం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను నల్గొండలోని ఆయన కార్యాలయంలో కలిసి రూ.18 వేలు ఇచ్చారు. ఈ డబ్బులను తీసుకుని బ్యాగులో పెడుతుండగా అధికారులు పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేశారు.

ACB Caught PanchayatRaj AE : అనిశా వలలో మరో అవినీతి చేప.. లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ పంచాయతీరాజ్​ ఏఈ

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ నల్గొండ ఆసుపత్రి సూపరింటెండెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.