ETV Bharat / state

ఎస్సారెస్పీ కాలువల మరమ్మతుల్లో జాప్యం - ఇలాగైతే సాగునీటికి కష్టాలు తప్పవు - SRSP Canal PENDING WORK

SRSP Canal Pending Works : ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో ఏటా సాగునీరు వృథాగా పోతోంది. జిల్లాలో ప్రధానమైన డి-83, డి-86 కాలువలతో పాటు వాటి ఉప కాలువలు చాలాచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంచాయతీల చొరవ, ఉపాధిహామీ పథకంతో చిన్నపాటి మరమ్మతులు, పూడికతీత పనులు జరుగుతున్నాయి. భారీగా దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

Sriram Sagar Project Incomplete Works
SRSP Canal Pending Works (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 1:30 PM IST

ఎస్సారెస్పీ కాలువల మరమ్మతుల్లో జాప్యం సాగునీటికి కష్టం (ETV Bharat)

Sriram Sagar Project Incomplete Works : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటి ద్వారానే పెద్దపల్లి జిల్లా రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. మంథని, రామగుండం ప్రాంతానికి డి-83, పెద్దపల్లి ప్రాంతానికి డి-86 కాలువ ద్వారా సాగునీరు అందిస్తున్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్‌లో లక్ష 88 వేల 949 ఎకరాల్లో రైతులు వరి సాగుచేయగా అందులో అధికంగా ఎస్సారెస్పీ కింద లక్ష 62 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఐతే డిస్ట్రిబ్యూషన్ కాల్వలకు 20 ఏళ్ల కిందట వేసిన సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతినడం, తూములు, డ్రాపులు, యూటీలు ప్రవాహ ఉద్ధృతికి పాడవడంతో తరచూ కాలువలకు గండ్లు పడుతున్నాయి.

రైతులే సొంత ఖర్చుతో తాత్కాలిక మరమ్మతు చేసుకొని, పంటలు కాపాడుకుంటున్నారు. నీటి వినియోగ సంఘాలు రద్దు కావడంతో కాలువల నిర్వహణ అటకెక్కి, చివరి భూములకు నీరందడం లేదు. ఏటా చివరి భూములకు నీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలిగేడు మండలం లాలపల్లి సమీపంలో ఎస్సారెస్పీ డి-86 ప్రధాన కాలువ తూముకు వరద ప్రవాహంతో గండి పడింది. ఏడాది కాలంగా మరమ్మతుకు నోచుకోలేదు. మేజర్, మైనర్‌ మరమ్మతుల కోసం 50 లక్షల పనులకు టెండర్లు పూర్తయ్యాయి. శాఖాపరమైన అనుమతులు, నిధులు కేటాయించాల్సి ఉంది. వర్షాకాలంలో వరదలకు కాల్వ గట్టు మరింత కోతకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులకు మంజూరు కాని నిధులు : కాల్వ శ్రీరాంపూర్‌ డి-83 పరిధిలోని ఆర్​ఎస్​డి-4 కాలువ పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి నుంచి వెన్నంపల్లి, జాఫర్‌ఖాన్‌పేట, ఇద్లాపూర్‌ వరకు వచ్చే కాలువ శిథిలావస్థకు చేరింది. పలు చోట్ల తూములు, కాలువ సీసీ పాడయ్యాయి. మరమ్మతులకు ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. పంట కాలువల్లో భారీగా పూడిక చేరడం, నీటి అవసరాల కోసం కొందరు కాలువకు గండ్లు పెడుతుండటం, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో చివరి భూములకు నీరు చేరడం లేదు. ఉపాధి హామీలో పూడికతీత పనులు ఇష్టానుసారంగా నిర్వహిస్తుండటంతో ప్రయోజనం కలగడం లేదు.

పంట కాలువలకు వచ్చే చిన్న చిన్న మరమ్మతులు వెంటనే నిర్వహించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యత ఎస్సారెస్పీ కాలువల మరమ్మతుకు ఇవ్వలేదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి పనులు వెంటనే చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

'ఈ ప్రాంతం నుంచి గోదావరి నీళ్లు తరలించి, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గజ్వేల్​, సిద్దిపేట, మెదక్​ ప్రాంతాలను సస్యశ్యామలం చేశారు. కానీ ఇక్కడ మర్మమతులు చేపట్టలేదు. ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఎస్సారెస్పీ సమస్యలను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేపడతాం'- విజయ రమణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్​​లో అడుగంటిన జలాలు - అన్నదాతకు తప్పని తిప్పలు - Water Crisis In SRSP Project

చురుగ్గా శ్రీరాంసాగర్ గేట్ల మరమ్మతు పనులు - వరద రాకముందే పూర్తి చేసేలా అధికారుల ప్రయత్నం - SRSP Gates Repair Actively

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.