ETV Bharat / state

మంత్రి తుమ్మల చొరవతో శరవేగంగా గోదావరి వంతెన పనులు - రాములోరి కల్యాణం నాటికి అందుబాటులోకి! - Godavari Bridge works ongoing

‍Godavari Bridge works ongoing in Bhadrachalam : తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో గోదావరి వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ వంతెన అందుబాటులోకి వస్తే నాలుగు రాష్ట్రాలకు మేలు జరగనుంది. గతంలో వరదలు వచ్చినప్పుడు పలు కాలనీల్లోకి నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం కరకట్ట విస్తరణ పనులు చేపట్టడంతో వరదలు వచ్చినా, కాలనీల్లోకి రాకుండా చర్యలు చేపట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Second Bridge in Bhadrachalam
‍Godavari Bridge works ongoing in Bhadrachalam
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 1:33 PM IST

శరవేగంగా సాగుతున్న గోదావరి రెండో వంతెన పనులు - రాములోరి కల్యాణం నాటికి అందుబాటులోకి

Godavari Bridge works ongoing in Bhadrachalam : భద్రాచలం పట్టణంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న వంతెన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా మధ్య రాకపోకలను అనుసంధానం చేస్తుంది. గతంలో నిర్మించిన వంతెన 50 ఏళ్లు పూర్తై పాత బడటంతో కొత్త బ్రిడ్జి నిర్మించాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించగా, మంత్రిగా ఉన్న తుమ్మల శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బీఆర్​ఎస్ ​(BRS) సర్కారు అధికారంలోకి రావడంతో వంతెన పనులు నత్తనడకన సాగాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి పాలైనా, భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ పార్టీకి చెందిన తెల్లం వెంకట్రావు గెలిచారు.

Second Bridge in Bhadrachalam : ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం కరకట్టను పొడిగించి, రెండో వంతెన పనులు శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. పనులు తొందరగా పూర్తి చేయడానికి మంత్రి తుమ్మల రూ.కోటి నిధులు విడుదల చేయించారు. వారం వారం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, ఏప్రిల్ 17న భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణం వరకు రెండో వంతెన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రియాంక ఆల ఇతర అధికారులు రెండో వంతెన పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.

గోదావరిపై కరకట్ట నిర్మించి చాలా కాలమైంది. కూనవరం రోడ్డులో సుమారు 700 మీటర్లు మేర కరకట్ట పోయకుండా మిగిలిపోవడంతో అటువైపు నుంచి వరదనీరు వచ్చి శాంతినగర్, సుభాశ్​ నగర్ కాలనీలు ప్రతీ ఏటా ముంపునకు గురవుతున్నాయి. ఆ కాలనీల్లో సుమారు పది వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఏడాది వచ్చే వరద కంటే 2023లో గోదావరి(Godavari)వరద కొంత మేరకు తక్కువగా రావడం వల్ల ఇబ్బంది రాలేదు.

స్థానికుల్లో ఆనందం : ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గోదావరి వరదలపై సమీక్షించి మళ్లీ వర్షాలు వచ్చేలోగా కాలనీలు ముంపుబారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కరకట్ట విస్తరణ పనులతో పాటు 8 ఏళ్లుగా నత్త నడకన సాగుతున్న గోదావరి రెండో బ్రిడ్జి పనులు తొందర్లో పూర్తి చేయాలని ఆదేశించింది. వచ్చే వర్షాకాలం నాటికి భద్రాచలంలోని లోతట్టు బాధితుల మొహాల్లో ఆనందం కనబడుతుందని, రెండో వంతెన పనులు శరవేగంగా సాగుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

'2022లో భద్రాచలంలో అన్ని కాలనీలు నీటిలో మునిగి చాలా నష్టపోయాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో గోదావరి వంతెన పనులు జరుగుతున్నాయి. దీనివల్ల భద్రాచలం స్థానికులందరూ గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఉండొచ్చు. బ్రిడ్జి ఎత్తు పెంచడం కోసం నిధులు సేకరించి పనులు ప్రారంభించారు. భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మంత్రి తుమ్మల శ్రద్ధ చూపిస్తున్నారు.' - స్థానికులు

భద్రాచలం కరకట్ట సమస్య - కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా పరిష్కారం చూపాలంటున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.