ETV Bharat / state

శివార్లలో గుప్పుమంటున్న గంజాయి - పొలంలోనే సాగు - చివరికి పోలీసులకు చిక్కి - TS Police Action Ganja Smuggling

Ganja Cultivation in Shankarpally : హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటోంది. ఇప్పటి వరకు అక్రమార్కులు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయించడంతో పాటు చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్ముతున్నట్టు అనేక సార్లు పోలీసుల దాడుల్లో బయటపడింది. తాజాగా శివార్లలోని శంకర్‌పల్లిలో జొన్నతోటలో గంజాయి సాగు వ్యవహారం బయటపడడంతో ఒక్కసారిగా పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో నగర శివారు ప్రాంతంలో నిఘా, తనిఖీలు ముమ్మరం చేశారు.

Ganja Cultivation in Shankarpalli
Ganja Cultivation in Shankarpalli
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 10:32 AM IST

వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్న రైతు అరెస్టు

Ganja Cultivation in Shankarpally : రాష్ట్రంలో మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్​ మాట అనేది వినిపించకూడదన్న ముఖ్యమంత్రి రేవంత్‌​రెడ్డి ఆదేశాలతో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాల సరఫరాపై డేగ కళ్లతో మాటు వేసి, పక్కా సమాచారంతో నిందితులను పట్టుకుంటున్నారు. కానీ వాటికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

Ganja Smuggling in Telangana : తాజాగా సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఓ వ్యక్తి కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కల సాగు (Cannabis Cultivation) ఎస్వోటీ పోలీసుల దాడుల్లో వెలుగు చూసింది. మత్తు పదార్థాలు, గంజాయి వంటివి అరికట్టడానికి పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే మరోవైపు ఏకంగా శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేయడం కలకలం రేపుతోంది. గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న గంజాయి సాగు వ్యవహారం ఎస్వోటీ పోలీసుల దాడులతో బహిర్గతమైంది.

ganja cultivation in Hyderabad : ఏం తెలివి బాసూ.. ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు

నగర శివార్లలోని శంకర్‌పల్లి రావులపల్లి కలాన్‌ గ్రామంలో జొన్న పంట మాటున అనుమానం రాకుండా సుధీర్‌ అనే రైతు గంజాయి సాగు చేస్తున్నాడు. ఇతను సంవత్సరం క్రితం నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అధిక సంపాదన కోసం అక్రమ మార్గాలు ఎంచుకున్నాడు. జొన్న పంట మాటున గంజాయి సాగు చేయాలని భావించాడు. వంద నుంచి 150 మొక్కలు సాగు చేశాడు. వీటిలో కొన్ని మొక్కలు కోసి వాటిని ఎండబెట్టాడు.

నగర శివార్లలో తనిఖీలు ముమ్మరం : సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి మొక్కలను ధ్వంసం చేసి సుధీర్‌ను అరెస్టు చేశారు. అయితే ఇతను ఎంతకాలంగా గంజాయి సాగు చేస్తున్నాడు, ఎవరికి సరఫరా చేస్తున్నాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇంకా ఎక్కడైనా సాగు చేశాడా, ఎవరి సూచనల మేరకు గంజాయి సాగు చేస్తున్నాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగర శివార్లలో గంజాయి సాగు బయటపడడంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. శివార్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్టు అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.

Rythu bandhu Stopped: గంజాయి సాగు చేసిన రైతు.. రైతుబంధు బంద్​ చేసిన అధికారులు

Police Action Ganja Smuggling : మరోవైపు తెలంగాణలో గంజాయి (Ganja Smuggling) వ్యసనపరులు పెరుగుతున్నారని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలతో ఏ స్థాయిలో గంజాయి, మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చి చేరుతున్నాయో అర్థమవుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను అక్రమార్కులు అడ్డాగా మార్చుకుని మత్తు దందాను సాగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఏపీ, ఒడిశా, భద్రాద్రి కొత్తగూడెం అటవీప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. గతంలో కేవలం కూలీలు, జేబు దొంగలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి చెంతకు చేరుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

మత్తు దందాకు అడ్డాగా హైదరాబాద్‌ - గంజాయి గ్యాంగ్​ను పట్టుకునేందుకు పోలీసుల నయా ప్లాన్

Hightech Cannabis Cultivation : హైటెక్​ పద్ధతిలో గంజాయి సాగు.. ఇంట్లోనే కుండీలు పెట్టి పెంపకం.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.