Gaddar Awards in Telangana : సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ఇకపై గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు కలిసి నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరగా ఆ నిర్ణయానికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి (Gaddar)రోజున ఆ పురస్కారాలు పురస్కారాలు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో వెల్లడించారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రులు ఆయన్ని అభినందించారు.
Nandi Awards Gaddar Award Telangana : కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డుల పేరిట ఇస్తాం. నా మాటే శాసనం, నా మాటే జీవో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గద్దర్ జయంతి రోజున పురస్కారాలను అందిస్తాం. వారి సేవలను స్మరించుకునేందుకే ఈ నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నా. గద్దర్ స్పూర్తిలో తెలంగాణలో ప్రజాపాలన సాగుతోంది. గద్దర్ మాటలే మాకు స్పూర్తి. - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
పేద, బడుగు బలహీనవర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా గద్దర్ జీవన ప్రయాణం సాగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. పత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషి చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. గద్దర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందన్న సీఎం అందుకు నిదర్శనమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే ఏర్పాటు చేయాలని సభాపతికి వినతిపత్రం ఇవ్వడమే నిదర్శనమని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy participated Gaddar Jayanti : కాంగ్రెస్‌ను కాలగర్భంలో కలిపేందుకే భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ పని చేస్తున్నాయని గద్దర్ ముందే అప్రమత్తం చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణలోనూ, దేశంలోనూ హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారని వివరించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలితే ప్రజలు సహించరని స్పష్టం చేశారు. ఈ రోజు ఏ పని చేయాలన్న దాన్ని అడ్డుకోవలనే ప్రతిపక్షాలు ఆలోచన చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
Gaddar Life Story : గద్దర్...! ఆ పేరే ఓ విప్లవ స్వరం..! ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.?
ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు చేసే సలహాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వాటన్నింటికి కాంగ్రెస్ పార్టీ భయపడే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఏ అవరోధం ఎదురైన రాష్ట్రంలో ఐదేళ్ల పాటు సుస్థిరపాలన అందిస్తామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గద్దర్ అంతరంగాన్ని స్పష్టీకరిస్తూ రచించిన పాటకు జీవకణం, తరగని గని అనే రెండు పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, గద్దర్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గోన్నారు.
Gaddar Sand Art Create in Karimnagar : తెలంగాణ నేలతల్లి ముద్దుబిడ్డ గద్దరన్నకు సైకత జోహార్లు