ETV Bharat / state

సొమ్ము ప్రజలది సోకు జగన్​ది - తాడేపల్లి ప్యాలెస్ రోడ్డంతా ఆక్రమణే - Jagan occupy public propert - JAGAN OCCUPY PUBLIC PROPERT

Former CM Jagan occupy public propert : శత్రు దేశాల భయంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భారీ కోటలు కట్టుకున్నట్లే, ఆంధ్ర మాజీ సీఎం జగన్ సైతం ప్రజాధనంతో రక్షణ వలయం నిర్మించుకున్నారు. జగన్ కోట వద్ద, డబుల్ లైన్ రహదారి ఆక్రమించి కోటను నిర్మించడం వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును, జగన్ భద్రతా సిబ్బంది ప్రైవేట్‌ రోడ్డుగా మార్చేశారు. క్యాంప్‌ ఆఫీసు పరిధిలో 1.5 కి.మీ. రోడ్డుకు రూ.5 కోట్ల వ్యయం నిర్మించగా.. జగన్ భద్రతా సిబ్బంది ఎవరినీ అనుమతించడం లేదు.

JAGAN OCCUPY PUBLIC PROPERT
Former CM Jagan occupy public propert (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 6:44 PM IST

Former CM Jagan occupy public propert : గతంలో తాను అధికారంలోకి రాగానే అక్రమ కట్టడం అంటూ ప్రజావేదికను కూల్చిన మాజీ ముఖ్యమంత్రి, అధికారం కోల్పోయినా ఇంకా ప్రభుత్వానికి సంబంధించి రాజభోగాలు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్లు, నిర్మించిన రోడ్లను ఇప్పటికీ తన గుప్పిట్లో ఉంచుకుని అధికార కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడు. ప్రభుత్వం మారినప్పటికీ తన పంథాను మార్చకుండా తాను ఇంకా అధికారంలోనే ఉన్నాననే భ్రమలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో మాజీ సీఎం ఇంటి, కార్యాలయ అవసరాల కోసం పెట్టిన ఖర్చుల వివరాలను అధికారులు బయటకి తీస్తున్నారు.

మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద వేసిన డబుల్ లైన్ రోడ్ వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లైన్ రోడ్డును ప్రైవేటు రోడ్డుగా మార్చేశారు. అటు వైపుకు వెళ్లడానికి జగన్ భద్రతా సిబ్బంది ఎవరిని అనుమతించడం లేదు. కేవలం క్యాంపు ఆఫీసు పరిధిలోని 1.5 కిలోమీటర్ల రోడ్డుకు సుమారు రూ.5 కోట్ల వరకూ వ్యయంతో రోడ్డును నిర్మించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి రేవేంద్రపాడు వరకూ 1.5 కిలోమీటర్ల డబుల్ లైన్ కోసం మంజూరైన నిధుల్ని వాడేసి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

లోటస్​పాండ్​లో జగన్‌ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు - కూల్చివేసిన జీహెచ్​ఎంసీ అధికారులు - Jagan illegal sheds demolished

ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు. అప్పటి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే ప్రస్తుత రాజకీయ భేటీలు జరుగుతున్నాయి. అయితే తాను సీఎంగా ఉన్నప్పటు హోదాను అడ్డుపెట్టుకొని జగన్ క్యాంప్ ఆఫీసు కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల ఫర్నిచర్, కార్యాలయ సామాగ్రి, ఇంకా మాజీ సీఎం వినియోగిస్తున్నారు. ఇప్పుడు అదే క్యాంప్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చుకోవడంపై అధికార వర్గాల్లో చర్చ మెుదలైంది.

సీఎం హోదాలో వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారనే అంశానికి సంబంధించిన జీవోలను అధికారులు వెలికి తీసేపనిలో ఉన్నారు. ఇంటి చుట్టూ ప్రహరీ గోడపై ఇనుప ఫెన్సింగ్ కోసమే కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ ఫార్మర్లు, యూపీఎస్ వ్యవస్థల ఏర్పాటు కోసం దాదాపు 3.63 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నిబంధనల పేరుతో అడ్డగోలుగా ప్రజా వేదిక కూల్చేసిన జగన్, అధికారం కోల్పొయినా నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ఫర్నిచర్ ను వినియోగించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను అతిక్రమించారని తేలితే, రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎం జగన్​కు నోటీసులిచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తనకు కేటాయించిన శాఖలపై మనసులో మాట చెప్పిన పవన్​ - ఏమన్నారంటే?

పాలనలో తన మార్క్​, మార్పు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు - పూర్తిస్థాయిలో ప్రభుత్వ ప్రక్షాళన - Public Grievance Redressal System

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.