Floating Restaurant in East Godavari Andhra Pradesh : వీకెండ్స్, హాలీడేస్ వస్తే చాలు అలా హాయిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సమయం గడపాలి అనుకుంటారు. కొత్తకొత్త హోటల్స్, ప్రాంతాలకు వెళ్తుంటారు. కరోనా తర్వాత ఏం సమయంలో ఏం జరుగుంతో తెలీదు ఉన్నప్పుడే అయినవాళ్లతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. అలా కొత్త ప్లేసెస్ గురించి తెగవెతికేస్తున్నారు.
మంచిగా వ్యూస్ ఉన్న, వ్యూ ఉన్న హోటల్స్, రెస్టారెంట్లను వెతికి అక్కడకు వెళ్లి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. అలాంటి వారిని ఆనందపర్చడానికి ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలోని ఓ ప్రైవేటు ప్లాన్ చేసింది. అలా సాయంకాలం ఆహ్లాదకర వాతావరణంలో గోదారి అందాల నడుమ రుచుల విందు ఆస్వాదించేలా ఫ్లోటింగ్ రెస్టారెంటును సిద్ధం చేస్తోంది. ఏపీ పర్యాటక శాఖ సౌజన్యంతో ప్రైవేటు వ్యక్తుల నిర్వాహణలో గోదావరిపై మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉమా మార్కండేయస్వామి దేవాలయం సమీపంలోని లాంచీల రేవు నుంచి ఏపీ టూరిజం బోట్‌లో ప్రయాణించి ఫ్లోటింగ్ రెస్టారెంట్‌కు చేరుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అక్టోబర్ 27న (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దీనిని ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌లో కిట్టీ పార్టీలు, పుట్టినరోజు వేడుకలు జరిపేవిధంగా అనువుగా ఉంటుందని యాజమాన్యం తెలిపింది.
ఆ ఆనందమే వేరు : ఆంధ్ర వంటకాలంటే నోరూరు పోతుంది. అంది గోదావరి దగ్గర నీటిలో తెలియాడుతుంటే విందు ఆరగించడమంటే ఊహాలు ఎక్కడితో పోతున్నాయి కదా. అలా ప్రతిఒక్కరు ఈ అనుభూతులు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో నచ్చినవారు, నోరూరించే విందు, చుట్టుపక్కల మంచి వాతావరం ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి అంటుంచారు. అలా మీరు మీ ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్లి ట్రై చేయండి.
భారత్‌లో విదేశీ టూరిస్టులు వెతికిన టాప్ 10 ప్రాంతాలు ఇవే! - అవేంటో మీకు తెలుసా?