ETV Bharat / state

కుమార్తెతో ఫోన్ చేయించి లారీ డ్రైవర్ హత్య - మృతదేహాన్ని ముక్కలుగా నరికి గుట్టల్లో పడవేత - YOUNG MAN MURDERED IN SANGAREDDY

సంగారెడ్డి జిల్లాలో లారీ డ్రైవర్ హత్య కేసులో పురోగతి - ఆంగోత్​ దశరథ్​ కేసు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు - దశరథ్​ను చంపి ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేసిన నిందితుడు

Young Man Brutally Murder
Young Man Brutally Murder (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 3:23 PM IST

Young Man Brutally Murder : సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్యకు గురైన లారీ డ్రైవర్​ ఆంగోత్​ దశరథ్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుమార్తెను ప్రేమిస్తున్నాడని యువతి తండ్రి గోపాల్ దశరథ్​​ను దారుణంగా హతమార్చాడు. ముందుగా దశరథ్​ను బండరాయితో అంతమొందించి, ఆ తర్వాత పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్​ మండలంలోని నాగధర్​రాంచందర్​ తండాకు చెందిన ఆంగోత్​ దశరథ్​ కొన్నేళ్లుగా సంగారెడ్డిలోని గణేశ్​ షుగర్​ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు స్వస్థలంలోనే నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం లారీ యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపై దశరథ్​ స్వగ్రామానికని బయలుదేరాడు. కానీ స్వగ్రామానికి చేరుకోలేదు. అలాగని పని చేసే చోటా లేడు. దీంతో ఆయన భార్య సంగారెడ్డి రూరల్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దశరథ్​ భార్య ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు శుక్రవారం అదృశ్యం కేసు నమోదు చేశారు. శనివారం నిజాంపేట్​ మండలంలోని మెగ్యానాయక్​ తండాకు చెందిన గోపాల్​ తానే దశరథ్​ను హత్య చేశానని ఖేడ్​ స్టేషన్​లో లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేసి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాబడుతున్నట్లు సమాచారం.

కుమార్తెతోనే ఫోన్​ చేయించి : దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. దశరథ్​కు గోపాల్​ తన కుమార్తెతోనే ఫోన్​ చేయించి ట్రాప్​ చేసినట్లు గుర్తించారు. దశరథ్ వచ్చిన వెంటనే గోపాల్​తో పాటు మరో వ్యక్తి అతనితో వాగ్వాదానికి దిగారు. కొంత తోపులాట జరిగింది. దశరథ్​కు ఇదివరకే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మళ్లీ తన కుమార్తె జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావ్ అంటూ గోపాల్ దశరథ్​ను పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదన్నట్లు సమాచారం. దశరథ్ బాలిక చదువుకుంటున్న పాఠశాలకు వెళ్లి ఆమెను కలవడం, ఎక్కువసేపు మాట్లాడటం వంటి విషయాలను గుర్తించిన పాఠశాల యాజమాన్యం, బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పక్కా ప్రణాళికతో దశరథ్​ను రప్పించి అతనిని హత్య చేసినట్లు సమాచారం.

తొలుత బండరాయితో తలపై కొట్టి చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అప్పటికీ మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేసినట్లు సమాచారం. శనివారం సాయంత్రం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్​లో దశరథ్​ను చంపింది తానేనంటూ గోపాల్​ లొంగిపోయినట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న గోపాల్​ అందించిన సమాచారం మేరకే ఈదులతండా శివారులో ఉన్న గుట్టల్లో అవయవాల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి గాలించగా మృతదేహం అవశేషాలను పోలీసులు గుర్తించారు.

అంతకుముందు దశరథ్ ట్రాక్టర్ డ్రైవర్​గా పనిచేసే వాడు. గోపాల్ పొలం దుక్కిదున్నే సమయంలో ఆయన కుమార్తెతో దశరథ్ పరిచయం పెంచుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఆ బాలికతో చనువుగా ఉన్నట్లు పలుమార్లు గోపాల్ గుర్తించారు. బాలిక చదువుకునే పాఠశాలకు కూడా పలుమార్లు వెళ్లినట్లు గుర్తించాడు. ఈ మొత్తాన్ని గుర్తించిన గోపాల్ కక్షపెంచుకుని ఎలాగైనా దశరథ్​ను అంతమొందించాలని, పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకే హత్య చేసి ఉండొచ్చు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కారులో ఎక్కించుకొన్నాడు - నగలపై ఆశపుట్టి హత్య చేశాడు

పారిశ్రామికవేత్త వీసీ జనార్ధన్ రావు దారుణ హత్య - 73సార్లు కత్తితో పొడిచి చంపిన మనవడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.